మరి భూపేష్ రెడ్డి భవితవ్యం ఏంటి?

Adinarayana Reddy, Contest in Assembly Elections, Bhupesh Reddy,election ,CEC, YCP, Jagan,BJP, TDP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Adinarayana Reddy, Contest in Assembly Elections, Bhupesh Reddy,,election ,CEC, YCP, Jagan,BJP, TDP

మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్  వెలువడనుండటంతో..రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులపై దృష్టి పెట్టాయి. రాబోయే ఎన్నికలలో పొత్తులు పెట్టుకుని కలిసి పోటీ చేస్తున్న పార్టీల నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు నడుస్తున్నాయి.  తాజాగా టీడీపీ..బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జమ్మలమడుగు నుంచి కమలం అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ‌రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో దిగుతారన్న ప్రచారం సాగుతోంది.

దీంతో  ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన జమ్మలమడుగు అసెంబ్లీలో..తాజాగా చోటు చేసుకుంటున్న ఈ రాజకీయ పరిణామాలు నియోజకవర్గాన్ని వేడెక్కిస్తున్నాయి.ఒకవేళ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి బరిలోకి దిగితే.. ఇప్పటి వరకు టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృష్టి చేస్తూ.. టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్న భూపేష్ రెడ్డి భవితవ్యం ఏంటనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ బీజేపీకి కేటాయించాల్సి వచ్చి. భూపేష్ రెడ్డి చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి‌కే ఈ టిక్కెట్ ఖరారు చేస్తే భూపేష్ రెడ్డి ఎలా రియాక్టవుతారనే  చర్చ నడుస్తోంది. వీరిద్దరిలో ఎవరు బరిలో దిగినా.. కుటుంబమంతా కలసికట్టుగా పని చేస్తారా, లేక అసంతృప్తులు రాజ్యమేలుతాయా అనే అంటూ  జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోం

ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆదినారాయణ రెడ్డి.. రాబోయే  ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో దిగడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి.. ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి..ఏపీ బీజేపీలో  ముఖ్య నాయకుల్లో ఒకరుగా ఉంటూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరంగా జమ్మలమడుగులో బీజేపీకి సానుకూల ఫలితాలు తీసుకురావడం వెనుక ఈయన హస్తం ఉంది.

కొద్ది రోజులుగా రాబోయే ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా..? ఒక వేళ ఆయన పోటీ చేస్తే పార్లమెంటుకు చేస్తారా అసెంబ్లీకి చేస్తారా  అంటూ  చర్చలు జరుగుతూ వస్తున్నాయి.తాజాగా టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటుందన్న సంకేతాలు వస్తుండటంతో.. ఆదినారాయణ రెడ్డి  జమ్మలమడుగు అసెంబ్లీ నుంచే పోటీ చేయడానికి సిద్ధం అవతున్నట్లు తెలుస్తోంది. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =