ఏపీ ప్రభుత్వ పిటీషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు, త్వరలోనే ‘మహా పాదయాత్ర’ పునఃప్రారంభిస్తామన్న అమరావతి జేఏసీ

Amaravati JAC Announces will Resume Maha Padayatra in Soon After AP High Court Rejects Govt Appeal Petition, High Court Dismisses AP Govt's Petition, Amaravati JAC Resume Maha Padayatra, AP Govt Petition on Maha Padayatra,Mango News,Mango News Telugu, High Court Dismisses Maha Padayatra Petition,Amaravati Farmers Maha Padayatra, Amaravati Farmers Latest News And Updates, Amaravati Farmers, Maha Padayatra, AP Three Capitals, Andhra Pradesh News, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజాగా మంగళవారం ఏపీ హైకోర్టు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అయితే పాదయాత్రలో పాల్గొనేవారు ఐడీ కార్డులు ధరించాలని, ఐడీ కార్డులున్నవారినే పాదయాత్రలో అనుమతించాలని సూచించింది. అలాగే పాదయాత్రలో పాల్గొంటున్నవారికి వెంటనే ఐడీ కార్డులు అందించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక సంఘీభావం తెలపాలనుకుంటున్నవారు ఏ రూపంలో ఐనా తెలుపవచ్చని, లోగడ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి యాత్ర కొనసాగించవచ్చని అనుమతినిచ్చింది.

ఈ క్రమంలో అమరావతి జేఏసీ కీలక ప్రకటన చేసింది. కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో త్వరలోనే మహా పాదయాత్రను పునఃప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. పాదయాత్ర ఆపిన రామచంద్రపురం నుంచే మొదలు పెడతామని, రైతులతో సమావేశం నిర్వహించి మరో 3, 4రోజుల్లో యాత్ర పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే రాష్ట్రానికి ఒకే రాజధాని విశాఖ అన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై ఆ పార్టీ ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే అమరావతిపై సుప్రీంకోర్టు సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని శివారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =