ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు

Andhra Pradesh State Annual Budget 2022-23 Live Updates, Assembly Session 2022 AP Cabinet Approves Annual Budget of Andhra Pradesh, Assembly Session 2022, AP Cabinet Approves Annual Budget of Andhra Pradesh, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Manog News, Manog News Telugu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ను రూ.2,56,257 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించింది. ఇక శాసన మండలిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో మంత్రి కన్నబాబు, శాసన మండలిలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టారు. ముందుగా శుక్రవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2022-23 కి ఆమోదముద్ర వేసింది.

ఏపీ బడ్జెట్ 2022-23 హైలైట్స్:

  • బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.2,56,257 కోట్లు
  • స్థానిక అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో సంక్షేమాన్ని పెంచడానికి, సామాజిక-ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి ఏర్పాటు. శాసనసభలో ప్రతి సభ్యుడు, సభ్యురాలి వద్ద రూ.2 కోట్ల నిధి ఉంటుంది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి కోసం నియోజకవర్గానికి రూ.2కోట్ల చొప్పున రూ.350 కోట్ల కేటాయింపు.

బడ్జెట్ కేటాయింపులు:

  • రెవెన్యూ వ్యయం – రూ. 2,08,261 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం – రూ.47,996 కోట్లు
  • రెవెన్యూ లోటు – రూ.17,036 కోట్లు
  • ద్రవ్యలోటు – రూ.48,724 కోట్లు
  • ఆర్థికరంగం – రూ.58,583.61 కోట్లు
  • వ్యవసాయం రంగం – రూ.11,387.69 కోట్లు
  • బీసీ సంక్షేమం – రూ.20,962.06 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా – రూ.3,900 కోట్లు
  • వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక – రూ.18,000 కోట్లు
  • వైఎస్ఆర్ ఆసరా – రూ.6,400 కోట్లు
  • వైఎస్ఆర్ చేయూత – రూ.4,235.95 కోట్లు
  • వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా – రూ.1802 కోట్లు
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు – రూ.500 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు – రూ.18 కోట్లు
  • వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు – రూ.50 కోట్లు
  • వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం – రూ.300 కోట్లు
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ – రూ.800 కోట్లు
  • వైఎస్ఆర్ భీమా – రూ.372.12 కోట్లు
  • వైఎస్ఆర్ వాహనామిత్ర – రూ.260 కోట్లు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం – రూ.200 కోట్లు
  • వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం – రూ.590 కోట్లు
  • వైఎస్ఆర్ లా నేస్తం – రూ.15 కోట్లు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం – రూ.500 కోట్లు
  • జగనన్న తోడు – రూ.25 కోట్లు
  • జగనన్న చేదోడు – రూ.300 కోట్లు
  • జగనన్న అమ్మఒడి – రూ.6500 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన – రూ.2,500 కోట్లు
  • జగనన్న వసతి దీవెన – రూ.2,083.32 కోట్లు
  • మనబడి, నాడు-నేడు కార్యక్రమాలు కోసం – రూ.3,500 కోట్లు
  • పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం – రూ.4791.61 కోట్లు
  • నీటివనరుల అభివృద్ధి కోసం – రూ.11,482.37 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి కోసం – రూ.15846.43 కోట్లు
  • పట్టణఅభివృద్ధి కోసం – రూ.8796.33 కోట్లు
  • పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం – రూ.2755.17 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ కోసం – రూ.8581.25 కోట్లు
  • ఇంధనశాఖ – రూ.10,281 కోట్లు
  • గృహ మంత్రిత్వ శాఖ – రూ.7,586.84 కోట్లు
  • యువజన, పర్యటక మరియు సాంస్కృతిక శాఖ కోసం – రూ.290.31 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ – రూ.50 కోట్లు
  • ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా – రూ.5000 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ – రూ.18,518 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ – రూ.6145 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ – రూ.29,143 కోట్లు
  • అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ.3661 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
  • కాపు సంక్షేమం – రూ.3537 కోట్లు
  • ఉన్నత విద్య – రూ.2,014.30 కోట్లు
  • సెకండరీ ఎడ్యుకేషన్ – రూ.27,706.66 కోట్లు
  • విద్యుత్ రంగం – రూ.10,281.04 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ – రూ.3,719.24 కోట్లు
  • జీఏడీ – రూ.998.55 కోట్లు
  • సచివాలయ వ్యవస్థ – రూ.3,396.25 కోట్లు
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు : రూ.10,201.60 కోట్లు
  • వెనుకబడిన వర్గాల అభివృద్ధి – రూ.20,962 కోట్లు
  • పశుసంవర్ధకం – రూ.1568.83 కోట్లు
  • పర్యావరణ, అటవీ – రూ.685.36 కోట్లు
  • పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖ – రూ.1568 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =