టీడీపీలోకి మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

YSRCP MLA joins TDP,Balineni Srinivasa Reddy, Jagan, Chevireddy, magunta,TDP, MLC elections, Vijayawada, YSRCP,ongole, prakesham district, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
YSRCP MLA joins TDP,Balineni Srinivasa Reddy, Jagan, Chevireddy, magunta,TDP

ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో రాజకీయసమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి  కొద్ది రోజులుగా మాగుంట సీటు కోసం పట్టుబట్టగా.. అధిష్టానం మాత్రం చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. చివరకు దీనిపై బాలినేనిని ఎట్టకేలకు రాజీ పడేలా చేశారు సీఎం జగన్. అయితే ఇదే సమయంలో జిల్లా నుంచి మరో  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే  జిల్లాలోని 8 స్థానాలకు  టీడీపీ అభ్యర్దులను ఖరారు చేసింది.

ఇటు ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ అభ్యర్దులపైన సుమారుగా క్లారిటీ వచ్చేసింది. ఒంగోలుతో పాటు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేయటం ఆల్మోస్ట్ ఖాయమైంది. మాగుంటనే ఎంపీగా కొనసాగించడానికి పట్టుబట్టిన బాలినేని ..తాజాగా చెవిరెడ్డితోనూ దీనిపై మాట్లాడారు.

2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ సారి మెజార్టీ స్థానాలను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఇటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు పైన  దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రకాశం జిల్లాలోని 12 స్థానాలకు 8 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు… దర్శి స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.  అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్‌, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు  , కొండపి-ఎస్సీ నుంచి  డోలా బాల వీరాంజనేయ స్వామి తిరిగి పోటీ చేయనున్నారు.

మరో ఐదు సీట్లలో కూడా ప్రస్తుత ఇన్‌చార్జులనే బరిలోకి దించాలని టీడీపీ అధి నాయకత్వం నిర్ణయించింది. కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి ఎం.అశోక్‌రెడ్డి, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్‌, యర్రగొండపాలెం నుంచి ఎరిక్సన్‌బాబు పోటీ చేయటం ఖరారు అయింది. ఇదే సమయంలో  ప్రకావం జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం మళ్లీ తెర మీదకు వచ్చింది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చినా కూడా  మహీధర్ రెడ్డి ఖండించారు.కానీ తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం ఖాయమంటూ నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fourteen =