వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా, బీ-ఫామ్‌ అందజేసిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Handover B-Form to YSRCP MLC Candidate Mohammad Ruhullah, AP CM YS Jagan Handover B-Form to YSRCP MLC Candidate, YS Jagan Handover B-Form to YSRCP MLC Candidate Mohammad Ruhullah, YSRCP MLC Candidate, YSRCP MLC Candidate Mohammad Ruhullah, Mohammad Ruhullah, MLC Candidate, MLC Candidate Mohammad Ruhullah, B-Form, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy Chief Minister of Andhra Pradesh, Andhra Pradesh, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు దివంగత ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు మహమ్మద్ రుహుల్లానే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. బుధవారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా మహమ్మద్ రుహుల్లా బీ-ఫామ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రుహుల్లా తండ్రి మహమ్మద్ సలీమ్‌, తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు ఈ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మార్చి 14 నుంచి జరగనుంది. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. పలువురు పోటీలో ఉంటే మార్చి 24న ఎన్నిక జరుగనుంది. లేకుంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ రుహుల్లానే ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =