మాండుస్ తుఫాన్ ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

AP CM YS Jagan held Review Meeting with Officials over Effect of Cyclone Mandous,Amid Cyclone Mandous,Telangana Heavy Rains,Heavy Rains In Telangana,Telangana Heavy Rains,Mango News,Mango News Telugu,Rain Prediction In Telangana,Heavy Rains In Andhra,Imd Prediction Os Rains,Imd Telangana,Telangana Imd,India Metoroligical Department,Imd Latest News And Updates,Imd News And Live Updates,IMD Rains For Next 2 Months In Telangana, Telangana IMD,India Metoroligical Department News and Updates

మాండుస్ తుఫాన్ తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరాన్ని దాటింది. ఈ తుఫాన్ ప్రభావం అధికంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ లోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంది. ఉత్తర తమిళనాడుతో పాటుగా, ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మాండుస్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి, అధికారులను తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట సహాయ శిబిరాలను తెరవాలని, వారికీ అండగా ఉండాలని సీఎం సూచించారు. ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షాల సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా చూడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏపీలోని నాలుగు ప్రభావిత జిల్లాల్లో 150 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ మరియు 95 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =