ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియామకం

Ummareddy Venkateswarlu Appointed As Govt Chief Whip in AP Legislative Council, AP Legislative Council, Ummareddy Venkateswarlu Appointed As Govt Chief Whip, Govt Chief Whip, Govt Chief Whip in AP Legislative Council, Ummareddy Venkateswarlu, YSRCP senior leader Umareddy Venkateswarlu was appointed as Chief Whip in the Legislative Council, Chief Whip in the Legislative Council, Legislative Council, Andhra Pradesh Legislative Council, AP Legislative Council News, AP Legislative Council Latest News, AP Legislative Council Latest Updates, AP Legislative Council Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులు కావడం ఇది రెండో సారి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక 2019లో మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఆయన తొలిసారి నియమితులయ్యారు.

కాగా ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయ్యాక అనంతరం, ఇటీవలే ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నిక అయ్యారు. గత నవంబర్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మళ్ళీ ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండోసారి కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకే ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =