యూపీ సీఎం పై పోటీకి.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెడీ

2022 UP assembly election, 2022 Up Assembly Elections, Army Chief Chandrashekhar Azad Ready, Army Chief Chandrashekhar Azad Ready To Contest Against UP CM Yogi Adityanath, Bhim Army Chief Chandrashekhar Azad Ready To Contest Against UP CM Yogi Adityanath, Bhim Army Chief Chandrashekhar Azad Ready To Contest Against UP CM Yogi Adityanath in Gorakhpur, Gorakhpur, Mango News, UP assembly, UP Assembly Election, UP assembly election 2022, UP Assembly Elections, UP Assembly Elections 2022, Up Assembly Polls, UP CM Yogi Adityanath, Yogi Adityanath UP Assembly Elections

దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించుకోవడం విశేషం. గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇటీవల యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. అతనిపై తాను పోటీకి దిగుతానని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గతంలోనే ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఓ సీటుని గెలవడం తనకు ముఖ్యం కాదు.. యోగి ఆదిత్యనాథ్‌ ని అసెంబ్లీకి రాకుండా చేయడమే తన లక్ష్యమని.. గత ఏడాది ఓ సందర్భంలో భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చెప్పారు. అందుకే, ఇప్పుడు యోగి పోటీకి దిగుతున్న గోరఖ్ పూర్ నుంచి ఛంద్రశేఖర్ ఆజాద్ కూడా బరిలోకి దిగనున్నారు. దీనిపై ఆయన నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ గురువారం సంచలన ప్రకటన చేసింది. గోరఖ్‌పూర్‌లో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి పోటీగా ప్రకటించిన మొదటి అభ్యర్థి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.

చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నికల్లో పోటీకి దిగుతుండటం ఇదే తొలిసారి. చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని భీమ్ ఆర్మీ.. 2017లో సహరాన్‌పూర్‌లో దళితులు – అగ్రవర్ణ ఠాకూర్‌ల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో దేశం దృష్టిని ఆకర్షించింది. ఘర్షణల అనంతరం చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. అలహాబాద్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. 16 నెలల జైలు జీవితం తర్వాత 2018 సెప్టెంబర్‌లో చంద్రశేఖర్ ఆజాద్ విడుదలయ్యాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =