తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

AP CM YS Jagan, AP CM YS Jagan Started Tungabhadra Pushkaralu, Kurnool, Mango News Telugu, Sankal Bagh Ghat in Kurnool, Tungabhadra, Tungabhadra Pushkaralu, Tungabhadra Pushkaralu 2020, Tungabhadra Pushkaralu 2020 Dates, Tungabhadra Pushkaralu at Sankal Bagh Ghat, Tungabhadra Pushkaralu Latest News, Tungabhadra Pushkaram, YS Jagan Started Tungabhadra Pushkaralu at Sankal Bagh Ghat

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు కర్నూలు జిల్లాలోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి,హోమంలో పాల్గొన్నారు. అనంతరం తుంగభద్ర నదికి హారతినిచ్చి పుష్కరుడిని ఆహ్వానించారు. పుష్కరాలు ప్రారంభ కార్యక్రమంలో సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలతో పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కర్నూలు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 23 ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ లలోకి భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే అనుమతించనున్నారు. కాగా పుష్కరాల్లో నది స్నానాలకు అనుమతి లేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నది స్నానాలకు అనుమతి ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + nineteen =