జలవివాదంపై కేంద్రమంత్రులు షెకావత్‌, ప్రకాశ్‌ జవదేకర్ కు సీఎం వైఎస్ జగన్ లేఖలు

AP CM YS Jagan, AP CM YS Jagan Writes Letters To Union Ministers, AP CM YS Jagan Writes Letters To Union Ministers over Water Disputes Between Telugu States, AP-TS Water Disputes, CM YS Jagan Writes a Letter To PM Modi over Water Disputes, Jagan writes to PM Modi over water disputes with Telangana, Krishna Water Disputes Tribunal, Mango News, Telangana AP Water Disputes, Water Disputes, water disputes between Andhra and Telangana, Water Disputes Between Telugu States, YS Jagan Writes Letters To Union Ministers

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ కు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ కు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకున్న కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ లేఖలు రాశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. “తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం జూన్ 01, 2021 నుంచి ఉపయోగించడం ప్రారంభించింది. శ్రీశైలంలో 834 అడుగుల కన్నా తక్కువున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే 19 టీఎంసీలు నీటిని వినియోగించుకున్నారు. తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం నిండటం దాదాపు అసాధ్యం. దీంతో దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాలకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మరియు చెన్నై నగరాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తాగునీరు మరియు నీటిపారుదల అవసరాలకు శ్రీశైలం రిజర్వాయర్ మీద ఆధారపడి ఉన్నారు” అని తెలిపారు.

“అలాగే తెలంగాణ యొక్క ఫిర్యాదులపై కేఆర్‌ఎంబీ వేగంగా పనిచేస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిర్యాదులను విస్మరిస్తుంది, కేఆర్‌ఎంబీ న్యాయమైన రీతిలో వ్యవహరించమని మళ్ళీకోరుతున్నాం. కేఆర్‌ఎంబీ జ్యూరీడిక్షన్ ను వెంటనే నోటిఫై చేయాలి. ఉమ్మడి రిజర్వాయర్ల వద్ద (నీటిపారుదల, విద్యుత్ మరియు నీరు తాగునీరు) కేఆర్‌ఎంబీ నియంత్రణలో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో కేంద్రం భద్రత కల్పించాలి” అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ కు రాసిన లేఖలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని, త్వరగా పర్యావరణ అనుమతులు, పనులను కొనసాగించడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =