ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటన, షెడ్యూల్ ఇదే..

AP Global Investors Summit 2023 Schedule Released For CM YS Jagan Three Day Tour of Visakhapatnam,AP Global Investors Summit 2023,AP Global Investors Summit Schedule Released,CM YS Jagan Three Day Tour,YS Jagan Visakhapatnam Tour,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,AP Bjp Chief Somu Verraju,YSR Congress Party,Telugu Desam Party,Janasena Party,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra pradesh Politics,AP Governer,AP Cabinet Minister,AP Ministers,Andhra Pradesh Welfare Schemes,AP CM Jagan Latest News and Live Updates

నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.

సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ టూర్ షెడ్యూల్..

మార్చి 2వ తేదీ (గురువారం) షెడ్యూల్

  • ఈరోజు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరతారు.
  • సాయంత్రం 5:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
  • ఈరాత్రికి ప్రత్యేక అతిథి గృహంలో బస చేయనున్నారు.

మార్చి 3వ తేదీ (శుక్రవారం) షెడ్యూల్

  • రేపు ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వద్దకు చేరుకొని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభిస్తారు.
  • రాత్రి 8-9 గంటల మధ్య ఎంజీఎం పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్స్ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
  • అనంతరం రేపు రాత్రికి నగరంలో బస చేస్తారు.

మార్చి 4వ తేదీ (శనివారం) షెడ్యూల్

  • శనివారం ఉదయం 9:10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వద్దకు చేరుకొని రెండోరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు.
  • ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలను, జీఐఎస్ ప్రతినిధులతో చర్చిస్తారు.
  • సీఎం జగన్ సమక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోకునుంది.
  • చివరిగా మధ్యాహ్నం 2 గంటలకు వైజాగ్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరతారు.
  • మధ్యాహ్నం 3:40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =