ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో జాప్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Andhra Pradesh Govt Files Petition in Supreme Court Regarding AP Bifurcation Issues Today,Andhra Pradesh Govt Files Petition,Supreme Court Regarding,AP Bifurcation Issues,Mango News,Mango News Telugu,Ap Reorganisation Act 2014,Andhra Pradesh Bifurcation Date,Problems In Andhra Pradesh 2022,Andhra Pradesh Issues,Telangana Bifurcation Date,Ap State Bifurcation Date,Ap Bifurcation Date,Andhra Pradesh Bifurcation Issues,AP-Reorganisation,Ap Reorganisation Act,Ap Bifurcation Act

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలులో జాప్యంపై బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో జాప్యం జరుగుతుండటం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. అలాగే విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విలువ సుమారు రూ.1,42,600 కోట్లకు పైగా ఉంటుందని, వీటిలో 90శాతం పైబడి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటి పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపడం లేదని, ఇది ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఇకనైనా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన సత్వరమే జరిగేలా చూడాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + seventeen =