ఏపీలో కోవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఎక్స్‌గ్రేషియాకు అర్హతలివే…

AP Govt Issued Orders on Rs 10 Lakh Ex-gratia for Children Orphaned Due to Covid-19,Mango News,Mango News Telugu,Mango News,Mango News Telugu,Covid-19 AP News,Andhra Govt To Make Rs 10 Lakh Ex-gratia For Children Orphaned,Covid-19 In AP,Children Orphaned,Andhra Govt Make Rs 10 Lakh Ex-gratia For Children,AP Govt Make Rs 10 Lakh Ex-gratia,Andhra Govt Make Rs 10 Lakh Ex-gratia,Andhra Govt Make Rs 10 Lakh Fixed,Andhra Govt Make Rs 10 Lakh,Andhra Govt Make Rs 10,Orphaned,Andhra Govt,Deposit,Children,Pandemic,Andhra,Andhra To Make Rs 10 Lakh FD For Children Orphaned,Andhra Pradesh Announces Ex-gratia Of Rs10 Lakh,Coronavirus in AP,Andhra Pradesh,Ex-gratia,Andhra Govt,Jaganmohan Reddy,CM Jagan,CM Jagan Live

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన అర్హత నిబంధనలకు అనుగుణంగా, కరోనా వలన అనాథలుగా మారిన పిల్లలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను ఎంపికచేసేందుకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి సభ్యుడిగా, స్త్రీ శిశుసంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సభ్యుడిగా, కన్వీనర్‌గా ఉండనున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆమోదం ఇచ్చేముందు, వచ్చిన దరఖాస్తులను స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ పరిశీలించనున్నారు.

ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన పిల్లల పేరుతో కలెక్టర్ నిర్ణయించిన విధంగా ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేయనున్నారు. ఆ బాండ్‌ను పిల్లలకు అప్పగించనున్నారు. ఆ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ప్రతి నెలా లేదా మూడునెలలు ఓసారి పిల్లలు తీసుకోవచ్చు. ఆ పిల్లలకు 25ఏళ్లు వచ్చిన తర్వాత రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.

ఎక్స్‌గ్రేషియాకు అర్హతలు:

  • దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి వారి వయసు 18 ఏళ్లలోపు వయసు ఉండాలి.
  • కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు.
  • తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, కరోనా కారణంగా మరొకరు కూడా మృతిచెందిన వారి పిల్లలు.
  • కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి మరియు నిర్ధారించేలా పీడీఎస్ కార్డు ఉండాలి.
  • మరణించినవారిలో కరోనా యొక్క ప్రాబల్యాన్ని సూచించే విధంగా కరోనా పాజిటివ్‌ రిపోర్టును చూపించాలి.
  • ప్రభుత్వ పరిధిలో ఇతర ఏ బీమా సంస్థల నుంచి లబ్ధి పొందనివారు మాత్రమే అర్హులుగా పరిగణిస్తారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =