వైసీపీకి బాలినేని రాజీనామా?. ఇదీ క్లారిటీ..

Balinenis Resignation from YCP This is Clarity, Balinenis Resignation, Balinenis Resignation from YCP, Resignation from YCP Balinenis, Balineni, Balineni Srinivas Rao, YCP, Latest Balineni Resignation News, Balineni Resignation News Update, Balineni Political News, TDP, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Balineni, Balineni srinivas rao, YCP, CM Jagan

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి టికెట్ దక్కదని భావించిన నేతలంతా పార్టీలు మారేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పార్టీలు మారగా.. మరికొంత మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు కూడా పార్టీ మారబోతున్నట్లు ఊహాగాణాలు వెలువడుతున్నాయి. త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి బాలినేని సైకిల్ ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంపై స్పందించిన బాలినేని శ్రీనివాసరావు.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తానని బాలనేని వెల్లడించారు. తాను విలువల కోసమే గతంలో మంత్రి పదవిని వదులుకున్నానని.. ఆనాడు జగన్ వెంట నడవడం వెనుక విలువలతో కూడిన రాజకీయాలే కారణమని బాలినేని చెప్పుకొచ్చారు. తాను వైసీపీలోనే సీఎం జగన్ వెంటే ఉంటానన్న బాలినేని.. వైసీపీ తరుపున ఒంగోలు నుంచే పోటీ చేస్తాని వివరించారు.

ఇదే విధంగా ఈసారి బాలినేనిని గిద్దలూరుకు పంపిస్తారనే కూడా ప్రచారం జరిగింది. దీనిపై కూడా బాలినేని శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. తాను గిద్దలూరు నుంచి పోటీ చేయడం లేదని వివరించారు. ఒంగోలు నుంచే వైసీపీ తరుపున బరిలోకి దిగుతానని బాలినేని వెల్లడించారు. కొందరు కవాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  దీంతో కొద్దిరోజులుగా బాలినేని శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారంటూ వస్తోన్న వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =