ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు : 8:30 గంటల వరకు 10.18 % పోలింగ్

AP Second Phase Panchayat Elections Polling Started,Mango News,Mango News Telugu,Andhra Pradesh Panchayat Election 2021 LIVE: Phase-2 polling underway counting of votes to begin at 4PM,AP Panchayat elections 2021: Second phase of polling started peacefully,AP Panchayat elections 2021: Polling for second phase grama panchayat elections begins 20% polling registered,Second Phase Of AP Panchayat Polls Underway

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా ఉదయం 8:30 గంటల వరకు 10.48 % పోలింగ్ ‌నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 13 జిల్లాల్లో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు ఎన్నికల నిర్వహణ కోసం 29,304 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా బాధితులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ముందుగా రెండో విడతకు సంబంధించి 18 డివిజన్లకు చెందిన 167 మండలాల్లోని 3328 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల అవగా 539 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 2,786 పంచాయతీల్లో నేడు పోలింగ్ జరగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల సిబ్బందికి గ్లోజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా బాధితులు ఎక్కువుగా ఓటువేయడానికి వచ్చే కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచారు. పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 17 =