ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు, అత్యవసరమైతేనే రావాలని సూచన

Banks Working Hours Restricted to 9 AM to 12 PM in AP Upto May 18th,Mango News,Mango News Telugu,AP Govt Issued Guidelines,AP Curfew Live News,AP Govt,AP CM,CM YS Jagan,Curfew In AP,AP Lockdown,Lockdown In AP,AP Lockdown 2021,AP Lockdown,AP Lockdown Guidelines,AP Lockdown Guidelines,Guidelines For AP Lockdown,Andra Pradesh,AP Lockdown News,Lockdown in Andhra Pradesh,AP Lockdown Rules,Coronavirus,AP News,AP Lockdown Latest News,AP Live News,Lockdown In AP 2021,Lockdown In AP Today,Lockdown In AP Rules,Banks Working Hours In AP,Bank Working Hours Changed Due To Curfew In AP,Banks Working Hours Restricted to 9 AM to 12 PM in AP,AP Banks Working Hours,AP Banks New Timing

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ అమలు నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 11, మంగళవారం నుంచి మే 18, మంగళవారం వరకు రాష్ట్రంలో బ్యాంకింగ్ పని వేళలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పరిమితం చేశారు.

బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా కూడా, వినియోగదారులకు సంబంధించిన లావాదేవీలను మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీ బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఖాతాదారులు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించారు. వీలైనంతవరకు బ్యాంకులకు చెందిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ, బ్యాంక్‌ మిత్ర సహా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − three =