ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..

BJP High Command Focus On Alliances in AP, BJP High Command Focus, BJP Alliances in AP, Alliances in AP, BJP, AP Assembly Elections, BJP Highcommand, AP BJP Chief Purandeshwari, Latest BJP High Command News, BJP High Command News Update, AP BJP Alliances News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
BJP, AP Assembly Elections, BJP Highcommand, AP BJP Chief Purandeshwari

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తుల అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే బీజేపీ ఈసారి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అటు టీడీపీతో పొత్తు కూడాలని చంద్రబాబు నాయుడు బీజేపీని కోరుతున్నారు. ఎలాగైనా పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటు తెలంగాణలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన.. ఏపీలో కూడా పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు చంద్రబాబు.. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరూ.. పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పొత్తు గురించి తేల్చుకునేందుకు త్వరలో చంద్రబాబు నాయుడు హస్తినాకు కూడా వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలతో సమావేశంపై పొత్తు గురించి ఏదో ఒకటి తేల్చుకోనున్నారు. అయితే ఇన్నిరోజుల నుంచి బీజేపీ పొత్తు గురించి ఎటూ తేల్చకుండా నాన్చుతూ వస్తోంది.

అయితే ఇన్నిరోజులు పొత్తు అంశంపై సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ అంశంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలు ఆసన్నమవుతుండడంతో.. పొత్తుపై ఏదో ఒక క్లారిటీకి రావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ విజయవాడ వెళ్లి బీజేపీ ఏపీ కోర్ కమిటీతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా పొత్తు గురించి ఈ సమావేశంలో చర్చలు జరపున్నారు. పొత్తుపై ఏపీ బీజేపీ ముఖ్యనేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే తరుణ్ చుగ్ విజయవాడ చేరుకోనున్నారు.

ఇక తరుణ్ చుగ్‌తో మీటింగ్ కంటే ముందే ఈరోజు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పొత్తులపై పదాధికారులు, జిల్లా అధ్యక్షుల నిర్ణయాలను స్వీకరించనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరపున్నారు. ఏది ఏమయినప్పటికీ ఏపీలో బీజేపీ పొత్తువైపు అడుగులు వేయడంతో.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =