పెద్దనోట్లపై ఆర్బీఐ ఏం చెప్పింది?

What Did The RBI Say About The Rs 2000 Notes, What Did The RBI Say, RBI Say About The Rs 2000 Notes, Rs 2000 Notes RBI, Rs 2000, RBI, Latest RBI 2000 Notes News, RBI 2000 Notes News, Latest RBI News, RBI News Update, RBI Restrictions, RBI Rule, National Banks, Bank News, Mango News, Mango News Telugu
Rs.2000, RBI say about the Rs.2000 notes?, RBI,

గతంలో రద్దు చేసి రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. రెండువేల రూపాయల నోట్లలో 97.38 శాతం నోట్లు ఇ‍ప్పటికే బ్యాంకులకు చేరాయని, కానీ ఇంకా రూ.9,330 కోట్ల విలువైన నోట్లు  ప్రజల వద్ద ఉండిపోయాయని ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది.

గతేడాది మే 19న ఆర్బీఐ.. రూ.2000 నోట్లను రద్దు చేస్తూ.. ఇకపై వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పి.. వాటిని బ్యాంకులలో మార్చుకోవాలని  ప్రకటించింది. ఆ సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే  2023 డిసెంబర్ 29వ తేదీకి  రూ.9,330 కోట్లకు ఆ నోట్లు తగ్గినట్లు ఆర్‌బీఐ తాజా ప్రకటనలో తెలిపింది. అంటే 97.38 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరగా..మిగిలినవి ఇంకా వారి వద్దే  ఉన్నట్లు ఆర్బీఐ చెప్పింది.

అయితే ఇప్పటికీ కూడా ప్రజల వద్ద రూ. 2,000 నోట్లకు చట్టబద్ధమైన చెల్లుబాటు కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం .. తమ వద్ద రూ.2 వేల నోట్లను ఎవరైనా సరే దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు కూడా. ఆర్‌బీఐ ఆఫీసులకు రాలేనివారెవరయినా.. పోస్టు ద్వారా రూ.2వేల నోట్లను పంపి తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్‌ కూడా చేసుకోవచ్చు.

రూ.2 వేల నోట్లను అన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ,మార్చుకోవడానికి ముందుగా ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే సమయం ఇచ్చింది. తర్వాత ఆ గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించింది. ఆ తర్వాత బ్యాంకు శాఖలలో డిపాజిట్, మార్పిడి సేవలను ఆర్బీఐ నిలిపేసింది. అయితే అక్టోబర్ 9 నుంచి ఆర్‌బీఐ ఆఫీసులలో  ఈ నోట్లు డిపాజిట్‌, మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.

దేశవ్యాప్తంగా రిజర్వ్‌ బ్యాంక్‌కు 19 ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. న్యూఢిల్లీ, హైదరాబాద్,  బెంగళూరు, కోల్‌కతా, లక్నో, ముంబై,  బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి, అహ్మదాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, నాగ్‌పూర్, పాట్నా, తిరువనంతపురం ఉండే ఆర్బీఐ కార్యాలయాల్లో.. రూ.2వేల నోట్లను  మార్చుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =