రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌‌ జగన్.. ఆయనకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు

CM Jagan Extends Wishes on Raksha Bandhan Brahma Kumaris and Several Women Leaders Ties Rakhi To Him, Brahma Kumaris and Several Women Leaders Ties Rakhi To AP CM YS Jagan, Several Women Leaders Ties Rakhi To AP CM YS Jagan, Brahma Kumaris Ties Rakhi To AP CM YS Jagan, CM Jagan Extends Wishes on Raksha Bandha, Raksha Bandhan 2022, 2022 Raksha Bandhan, Raksha Bandha Wishes, Raksha Bandha Greetings, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ‘రాఖీ’ పండుగ సందర్భంగా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘రక్షాబంధన్’ అన్నది ఆత్మీయతలూ, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ఏపీ ముందుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ దేవుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ కు పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు.

ఈ క్రమంలో ప్రముఖ ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి రాఖీలు కట్టారు. వీరిలో శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు బ్రహ్మకుమారి ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఆహ్వనించారు. ఇక మరోవైపు వీరితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి మహిళా నేతలు, పార్టీ నేతలు సీఎం జగన్ కు రాఖీలు కట్టారు. వీరిలో హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − two =