విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం.. ఈవోఐ కింద బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ

Former CBI JD Lakshmi Narayana Files Bid by Participating in The EOI of Vizag Steel Plant Today,Former CBI JD Lakshmi Narayana Files Bid,JD Lakshmi Narayana Participating in The EOI,CBI JD Lakshmi Narayana in EOI of Vizag Steel Plant Today,Mango News,Mango News Telugu,Ex JD Lakshminarayana's Sensational Decision,Ready to bid for Vizag Steel industry,CBI EX JD Lakshminarayana About Vizag Steel Plant,JD Lakshminarayana Reveals Unknown Facts,JD Lakshmi Narayana Joins Vizag Steel Plant Row,JD Lakshmi Narayana Latest News,JD Lakshmi Narayana Latest Updates,Centre Not in Hurry To Privatize Vizag Steel Plant

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కింద బిడ్ల దాఖలుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. అయితే అనూహ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈవోఐలో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేటుగా బిడ్ దాఖలు చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను బిడ్డలా చూసుకోవాలనే బిడ్ వేశానని, మున్ముందు దీనికోసం ఇంకా ఏం చేయాలనేది ఆలోచిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం క్లీన్ సేవ్ చేయాలనకుంటోందని.. అయితే తాము మాత్రం క్లియర్ సేవ్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థగా ఉండాలనేది తామందరి కోరిక అని, మన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఒక్కొక్కరు 400 రూపాయలు వెచ్చిస్తే చాలని, దీనికోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని, అసహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కానీ, నాయకులు కానీ ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలని, రోజుకోసారి, పూటకోసారి మాట మార్చడం పద్ధతి కాదని జేడి లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. ఇక అంతకుమందు శనివారం ఉదయం లక్ష్మీనారాయణ తెలుగు ప్రజల తరఫున ఈవోఐ బిడ్డింగ్‌లో తాను పాల్గొంటున్నానని వెల్లడించారు. దీంతో స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అంతటా ఆసక్తి నెలకొంది. చెప్పినట్లే ఆయన బీడ్ దాఖలు చేశారు. దీనిపై స్టీల్ ప్లాంట్ కార్మికులు లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి వ్యక్తిగతంగా ముందుకు వచ్చారని ఆయనను ప్రశంసించారు. అలాగే లక్ష్మీనారాయణకు అన్ని విధాలా సహకరిస్తామని కార్మికులు హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =