కాంగ్రెస్ ఎంపీ సీటు.. వెరీ హాటు..

Congress MP Ticket, Batti vikramarka, Janareddy, Thummala nageshwar rao,Telangana, kothagudem, Khammam MP Ticket, Khammam updates, Latest khammam news, Telangna BJP Party, ,Telangana Politics, Telangana Political News And Updates,Telangana News, Mango News Telugu, Mango News
Congress MP Ticket, Batti vikramarka, Janareddy, Thummala nageshwar rao. Telangana

లోక్‌స‌భ స‌మ‌రం స‌మీపించే కొద్దీ తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ పెరుగుతోంది. ఆయా పార్టీల నుంచి ఆశావ‌హుల సంఖ్య పెరుగుతోంది. పార్టీలు కూడా అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరే…. లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మరోవైపు తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు సైతం గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిష్ఠానం మెప్పు కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. నేటి సాయంత్రంతో కాంగ్రెస్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ  గడువు ముగియనుంది. బీఆర్‌ఎస్‌వి కుటుంబ రాజకీయాలంటున్న కాంగ్రెస్‌ నేతలు తమ వారసులను బరిలో దింపుతుండటం ఆస‌క్తిగా మారింది. తమ వారికి టిక్కెట్టు కావాలని కోరుతుండటం సామాన్యులకు అర్థం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయాల్లో అవన్నీ మామూలే అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ కీల‌క నేతల‌కు చెందిన స‌తుల్.. సుతుల్.. స‌న్నిహితులను లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం సీటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్లు కుటుంబానికే చెందిన మల్లు రవి నాగర్‌కర్నూలు టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నప్పటికీ  తాను ఎంపీకి పోటీచేస్తానని ఇదివరకే  ప్రకటించారు.పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తన చిన్నకొడుకు జయవీర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇప్పించుకొని నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. ఇప్పుడు పెద్ద కొడుకు రఘువీర్‌రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం సీటు కోసం అదే జిల్లానుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే వరుసలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్‌ ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఖమ్మం హాట్‌ సీటుగా మారింది. పైవారితోపాటు  ఇదే నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ కోసం మాజీ ఎంపీ వి.హన్మంతరావు దరఖాస్తుచేసుకున్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయని పక్షంలో తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి రేణుకాచౌదరి చెబుతున్నారు.  ఇక బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన వైద్యారోగ్యశాఖ అధికారి గడల శ్రీనివాసరావు సైతం కాంగ్రెస్‌లో చే రి ఈ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.మరో అధికారి తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేశ్‌నాయక్‌ మహబూబాబాద్‌ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య వరంగల్‌ లేదా మహబూబాబాద్‌కు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి సీటుకు సైతం భారీ డిమాండ్‌ ఉంది.సినీ నిర్మాత, పార్టీ నాయకుడు బండ్ల గణేశ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఏఐసీసీ మాజీ సభ్యుడు చింతల యాదగిరి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, తదిరులు మల్కాజిగిరి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, ఆకుల లలిత, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌లు కూడా లోక్ స‌భ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీకి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి ఆరుగురి ఆశావహుల పేర్లు వెళ్లినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు ప్రముఖుల పేర్లతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు పేరు సైతం తెరపైకి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =