రాష్ట్రంలో ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండేలా చూడాలి, శాంతి భద్రతలపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra CM Jagan Mohan Reddy, Andhra Pradesh CM holds review meeting, AP CS, ap dgp gautam sawang, AP Home Minitser, AP Home Minitser Mekathoti Sucharitha, CM YS Jagan byte on maintaining law and order in state, CM YS Jagan held Review over Law and Order, CM YS Jagan held Review over Law and Order in the State, Law and Order, maintaining law and order in state, Mango News, Mekathoti Sucharitha, YS Jagan Review over Law and Order

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో లా అండ్‌ ఆర్డర్‌ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నేరాల నిరోధంకై తీసుకుంటున్న చర్యలు, దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాలను నిరోధించడం తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేసుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం అందించామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలని, వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని చెప్పారు.

దిశ చట్టం ప్రగతిపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. దిశ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు వివరాలు అందించగా, శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదని, వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించడం, సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణ, మాదకద్రవ్యాల విషయంలో అన్నికాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ వంటి అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 19 =