ఏపీలో నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్, మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ

AP Inter Results 2023 Revaluation and Re-Verification Starts From Today Applications will be Taken Till 6th May,AP Inter Results 2023,AP Inter Revaluation and Re-Verification Starts,AP Inter Re-Verification Starts From Today,AP Inter Revaluation Applications will be Taken,AP Inter Applications will be Taken Till 6th May,Mango News,Mango News Telugu,AP Inter Marks Revaluation 2023,AP Inter Results 2023 Out Today,AP Inter Results for 1st and 2nd Year,AP Inter Results 2023 Live Updates,Manabadi AP Inter Results 2023 Declared,AP Inter Results 2023 Declared,AP Inter Re Verification Latest Updates,AP Inter Re Counting News Today

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన మేరకు బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 61% కాగా.. ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 72%గా నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ప్రకటించిన పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు ఏప్రిల్ 27 నుండి మే 6 వరకు తమ ఇంటర్ జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుండి 9 వరకు నిర్వహించబడతాయని కూడా తెలియజేశారు.

సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులు మే 3 వరకు ఫీజు చెల్లించడానికి అనుమతిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాగా మొదటి మరియు రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యా శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పదో తరగతి వరకు గల మొత్తం 371 పుస్తకాలకు గాను 353 పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన వాటిని కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెట్టనుంది. వీటిని వ్యక్తిగతంగా ఎవరైనా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nineteen =