రేవంత్ రెడ్డి వద్దకు ఎమ్మెల్యేలను పంపించింది హరీశ్ రావేనా..?

Harish Rao, Revanth Reddy, Harish Rao Send MLA's to Revanth Reddy, BRS MLAs, Raghunandan Rao, Telangana Politics, Telangana Latest Updates, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, BRS, Telangana State CM Revanth Reddy, MLA Harish Rao, BJP, Mango News Telugu, Mango News
Harish rao, BRS MLAs, Raghunandan rao, Revanth reddy

కొద్దిరోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈక్రమంలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని ఊహాగాణాలు వెలువడుతున్నాయి.

అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంపై బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు రేవంత్ రెడ్డిని కలవడం వెనుక బీఆర్ఎస్ కీలక నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ఓ బలమైన కారణం చేతనే హరీష్ రావు ఆ నలుగురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి వద్దకు పంపించారని చెప్పుకొచ్చారు. మెదక్ ఎంపీ సీటు విషయంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని.. వారి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థాలు వచ్చాయని అన్నారు.

మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కేసీఆర్ కుమార్తె కవిత పట్టుపడుతోందని.. కానీ అందుకు హరీష్ రావు అడ్డు చెబుతున్నారని అన్నారు. కవితకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడం హరీష్ రావుకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందుకోసమే నలుగురు ఎమ్మెల్యేలను హరీష్ రావు.. రేవంత్ రెడ్డి వద్దకు పంపించారని రఘునందన్ రావు బాంబు పేల్చారు.  అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఎంపీ టికెట్లను అమ్ముకునే పనిలో ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత  బీఆర్ఎస్ పరిస్థితి జీరో కావడం ఖాయమని అన్నారు.

ఇక ప్రస్తుతం కాలికి గాయం కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బరువు, బాధ్యలనంతా కేటీఆర్, హరీష్ రావులే మోస్తున్నారు. వాళ్లిద్దరే లోక్‌సభ ఎన్నికలకోసం సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పార్టీపై పట్టుకోసం బా, బామ్మర్థుల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోందని.. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =