జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, కీలక బీజేపీ నేతలతో భేటీ?

Candidate for Tirupati Lok Sabha By-election, janasena chief, janasena chief pawan kalyan, janasena chief pawan kalyan went to delhi, Janasena Party, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan To Meet BJP Top Leaders, Tirupati Lok Sabha By-election, tirupati loksabha bypoll

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా పలువురు బీజేపీ జాతీయ అగ్ర నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్టు సమాచారం. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించి, జనసేన పోటీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో ఏపీలో తిరుపతి లోక్ సభ నియాజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =