నేడు న్యూఢిల్లీలోని నివాసంలో సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi to Host a Sikh Delegation at his Residence in New Delhi Today, PM Modi To Meet Sikh Delegation At His Residence On April 29, Sikh Delegation in New Delhi, Prime Minister Narendra Modi is scheduled to host a Sikh delegation at his residence, Prime Minister Narendra Modi to host Sikh delegation at his residence today, Prime Minister Narendra Modi informed that he will be hosting a Sikh delegation at his residence today, Sikh Delegation at Prime Minister Narendra Modi residence, Prime Minister Narendra Modi residence, Sikh Delegation, Sikh Delegation News, Sikh Delegation Latest News, Sikh Delegation Latest Updates, Sikh Delegation Live Updates, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “ఈ సాయంత్రం నా నివాసంలో సిక్కు ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇస్తున్నాను. ఈ బృందంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అలాగే సాయంత్రం 5:30 గంటలకు ఆ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. తప్పక చూడండి” అని పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల సిక్కు సమాజానికి చెందిన సభ్యులను తరచుగా కలుస్తున్నారు. ఏప్రిల్ 21న న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అలాగే ఫిబ్రవరి 19న ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో గల ప్రధాని అధికార నివాసంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 37 మంది సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా సిక్కు ప్రముఖులను ప్రధాని మోదీ సత్కరించారు. తాజాగా శుక్రవారం మరోసారి సిక్కు ప్రతినిధి బృందానికి ప్రధాని ఆతిథ్యం ఇవ్వనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 16 =