విజ‌య‌న‌గ‌రంలో హిస్ట‌రీ రిపీట్ అవుతుందా?

Will History Repeat Itself In Vijayanagaram?,Game Changer,Chandrababu Naidu,Vijayanagara,YCP,TDP,Janasena,Chandrababu,Jagan,Pawan Kalyan,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Vijayanagaram Politics,Vijayanagaram Elections,Vijayanagaram Assembly Election 2024,Vijayanagaram Constituency,Vizianagaram TDP MP Candidate Kalisetti Appala Naidu,Kalisetti Appala Naidu,Kalisetti,Kalisetti News

గేమ్ చేంజ‌ర్ గా అధినేత చంద్ర‌బాబునాయుడి నుంచి కితాబు పొందిన క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు.. విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో ఎటువంటి చేంజ్ లు తెస్తార‌నేది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే.. ఏకంగా ఎంపీ టికెట్ పొందిన సంతోషంలో ఉన్న క‌లిశెట్టిని విజ‌యం వ‌రించ‌డం అంత ఈజీగా కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ప్ర‌త్య‌ర్థి అయిన బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ కూడా ఇక్క‌డ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయ‌న‌కు మంత్రి బొత్స అండ‌, ప‌టిష్ట‌మైన కేడ‌ర్ ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కావ‌డం, ఉత్త‌రాంధ్ర రాజ‌ధాని అంశం కూడా వైసీపీ అభ్య‌ర్థికి క‌లిసి రానున్నాయి. అయితే.. క‌లిశెట్టి కూడా ఇక్క‌డ సీనియ‌ర్ నేత‌. సుదీర్ఘ‌కాలంగా ఇదే ప్రాంతంలో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇద్ద‌రూ బీసీలే. ఈక్ర‌మంలో హోరాహోరీ పోరు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

వాస్తవానికి కలిశెట్టి అప్పలనాయుడు ఈ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. మూడు నాలుగేళ్లుగా అదే నియోజకవర్గంలో గ్రౌండ్‌ వర్క్‌ బాగా చేశారు. ఆ నియోజకవర్గంలో సీనియర్‌ నేత కళా వెంకటరావు ఉన్నప్పటికీ, టీడీపీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో మొండిగా వ్యవహరించారు కలిశెట్టి. సైకిల్‌ యాత్రలు, పాదయాత్రలు చేయడమే కాకుండా నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పరిచయాలు పెంచుకున్నారు. యువనేత లోకేశ్‌తో ఉన్న సఖ్య‌తను ఆస‌రాగా చేసుకుని ఆ టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని భావించారు. కానీ.. ల‌క్కీగా ఆయ‌న‌ను ఎంపీ టికెట్ వ‌రించింది.

అదే ల‌క్కీతో విజ‌య‌న‌గ‌రం లోక్‌స‌భ కు ఉన్న చ‌రిత్ర ప్ర‌కారం.. ఈసారి క‌లిశెట్టి గెలుపు ఖాయం అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే.. విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్‌, ఆ తర్వాత టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. ఇలా ప్రతి ఎన్నికకూ ఒక్కొపార్టీ గెలవడమే కాకుండా.. గెలిచిన నేత కూడా మారిపోతున్నారు. 2009లో బొత్స ఝాన్సీలక్ష్మి, 2014లో అశోక్‌ గజపతిరాజు, 2014లో బెల్లాన చంద్రశేఖర్‌ విజయనగరం ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో గెలిచిన ఝాన్సీలక్ష్మి 2014లో ఓడిపోగా, ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన బెల్లాన చంద్రశేఖర్‌ తాజాగా మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. చ‌రిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటుంద‌ని భావించ‌లేం. తిర‌గ‌బ‌డ్డ చ‌రిత్ర‌లు చాలానే ఉన్నాయి. మ‌రి క‌లిశెట్టి విష‌యంలో హిస్ట‌రీ రిపీట్ అవుతుందా.. లేదా చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =