కోటంరెడ్డికి ఈ సారి చెక్‌ పడేనా?

Will Kotamreddy Get A Check This Time?, Kotamreddy Get A Check, Nellore Rural, Voters, Kotam Reddy Sridhar Reddy, Adala Prabhakar Reddy,YCP, TDP, Janasena, Nellore Political News, Nellore Lok Sabha Seat, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Nellore rural, voters, Kotam Reddy Sridhar Reddy, Adala Prabhakar Reddy,YCP, TDP, Janasena,

నెల్లూరు రూరల్‌లో అధికార వైఎస్సార్సీపీ, తెలుగు దేశం పార్ట మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

నిజానికి 2014లో జరిగిన ఎన్నికలలో,2019 జరిగిన ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత రాజకీయ విభేదాలతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కాదని.. చంద్రబాబు చెంతకు చేరారు.

మరోవైపు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సీనియర్ రాజకీయవేత్తగా ఉంటూనే.. కాంట్రాక్టర్‌గా స్థానికంగా మంచి పేరును సంపాదించుకున్నారు. 1999 లో జరిగిన ఎన్నికలలో, 2004 జరిగిన ఎన్నికలలో, 2009 జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు.
అలాగే 2019 జరిగిన ఎన్నికలలో నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి..తెలుగు దేశం పార్టీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుపై 1,48,571 ఓట్ల తేడాతో గెలిచారు.

మరోవైపు పొత్తులో భాగంగా ఇప్పుడు సీటు దక్కించుకున్నకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జనసే నుంచి మద్దతు కరువైంది. కోటం రెడ్డికి టికెట్ కేటాయించడంతో అలిగిన నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి అతని అనుచరులతో పాటు .. ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు.

దీంతో 2019లో నెల్లూరు రూరల్ నుంచి బరిలో దిగిన చెన్నారెడ్డికి వచ్చిన 9 వేల ఓట్లు ఇప్పుడు టీడీపీకి మైనస్ కానున్నాయి. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇదే వైసీపీ కి ప్లస్ మారి నెల్లూరు రూరల్ లో ఆ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్న వాదన వినిపిస్తుంది.అయితే ఏ ఎన్నికలలో అయినా సరే కీలకంగా ఉండే కొన్ని ఓట్లు రాత్రికి రాత్రే నేతల తలరాతలు మార్చేస్తాయి. మరి అలాంటి ఓట్లు ఇప్పుడు ఏ పార్టీకి విజయాన్ని అందిస్తాయో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 10 =