– కీల‌క మ‌లుపులు తిరుగుతున్న జ‌గ‌న్ పై దాడి కేసు

A Case Of Assault On Jagan Who Is Turning The Key,CM Jagan,YSRCP,TDP,Chandrababu,Jagan Assault Case,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,CM YS Jagan,CM YS Jagan Latest News,CM YS Jagan News,CM YS Jagan Latest Updates,CM YS Jagan Memantha Siddham Bus Yatra,Memantha Siddham,Siddham,CM YS Jagan Bus Yatra,CM YS Jagan Stone Hit Incident,YS Jagan Attack Case,CM YS Jagan Attack Case Updates

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై దాడి కేసు కొలిక్కి వ‌స్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంది. ఇదిలాఉండ‌గానే.. ఈకేసు రాజ‌కీయ ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. తెలుగుదేశం నాయ‌కుల పేరు తెర‌పైకి రావ‌డం, ఈ విష‌యాన్ని వారే ప్ర‌చారం చేసుకుంటుండ‌డం ఆస‌క్తిగా మారింది.  సీఎం జగన్‌పై దాడి కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన వ‌డ్డెర సంఘం నేత వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న త‌ర్వాత కేసు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. దుర్గారావుతో క‌లిపితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారి సంఖ్య ఆరుకి చేరింది. ఇప్ప‌టి కి ఇద్ద‌రిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావు ఇటీవ‌లే పార్టీలో చేరిన‌ట్లు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆటోడ్రైవ‌ర్ గా ప‌నిచేసే దుర్గారావు బోండా కార్యాల‌య ప‌నులు కూడా చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే అత‌డిని అదుపులోకి తీసుకోవ‌డంతో అత‌డి ద్వారా బోండా ఉమ‌ను కేసులో ఇరికించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

ఈకేసులో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌చారంలో పాల్గొనేందుకు వ‌డ్డెర బ‌స్తీకి చెందిన కొంద‌రు యువ‌కుల‌ను వైసీపీ నేత‌ల‌ను త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో వారికి 350 రూపాయ‌లు, మందు, బిర్యానీ ఇస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. మందు బాటిల్ మాత్ర‌మే చేతిలో పెట్టి.. ప్ర‌చారం అనంత‌రం వైసీపీ నేత‌లు ముఖం చాటేశార‌ట‌. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఆ యువ‌కుల మ‌ధ్య దీనిపై చ‌ర్చ జ‌రిగింద‌ట‌. వైసీపీ నేత‌లు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే కోపంతోనే జ‌గ‌న్ పై రాయి విసిర‌న‌ట్లుగా టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. కేసు విచార‌ణ విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండానే, త‌ప్పించుకునేందుకు టీడీపీ నేత‌లు క‌ట్టు క‌థ‌నాలు అల్లుతున్నార‌ని వైసీపీ చెబుతోంది.

బొండా ఉమాకు చెందిన పార్టీ  కార్యాలయ వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ప్ప‌టి నుంచీ కేసు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. దుర్గారావును పావుగా ఉపయోగించుకుని విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. టీడీపీ నేతలూ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావును ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలిసింది. సీఎం జగన్‌ అజిత్‌సింగ్‌ నగర్‌లో రోడ్‌షో నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలో దుర్గారావే లేడ‌ని, అన‌వ‌స‌రంగా కేసులో ఇరుకిస్తున్నార‌ని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేవలం బొండా ఉమాను కేసులో ఇరికించడానికే దుర్గారావును కావాల‌ని తీసుకెళ్లార‌ని ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. ఈనేప‌థ్యంలో మున్ముందు ఎటువంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 20 =