డిగ్రీ, పీజీ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్

AP Degree Exams, AP PG Exams, janasena chief, janasena chief pawan kalyan, Janasena Latest News, pawan kalyan, Pawan Kalyan Appeals AP Govt, Pawan Kalyan Appeals AP Govt to Cancel Degree Exams

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి, ఉత్తీర్ణత ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం. పదో తరగతి రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్న వారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలి. డిగ్రీతోపాటు ఎం.బి.ఎ., ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ., లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్ లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని” పవన్ కళ్యాణ్ అన్నారు.

“మరో వైపు పై చదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్ సెలెక్షన్స్ లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని, పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికి రాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్ధులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్ధుల ఆరోగ్యం, వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =