విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్పుపై టీడీపీ నేత నారా లోకేష్‌ విమర్శలు

TDP Leader Nara Lokesh Responds Over The Name Change of Vizianagaram Maharaja Hospital, TDP Leader Nara Lokesh, Vizianagaram Maharaja Hospital, Name Change of Vizianagaram Maharaja Hospital, Mango News , Mango News Telugu, Nara Lokesh Latest News And Updates, Nara Lokesh, TDP Nara Lokesh, TDP Chief Nara Chandrababu Naidu, TDP AP, Telugu Desham Party, YSR Congress Party, AP CM YS Jagan Mohan Reddy, NTR Health University Name Change, Vizianagaram Maharaja Hospital Name Change,

విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మారుస్తూ తీసుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వ తీరుని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను విమర్శించారు. సీఎం జగన్‌ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని, మహనీయులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కోట్ల రుపాయల విలువైన భూమిని ఆస్పత్రి కోసం విజయనగరం మహారాజా కుటుంబం ఇచ్చిందని లోకేష్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారని, కానీ ఇవేమీ పట్టని జగన్ సర్కార్ రాత్రికి రాత్రే మహారాజా పేరుని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆస్పత్రికి మహారాజా పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా గురువారం రాత్రి మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరుకి బదులు సర్వజన ఆస్పత్రి పేరుతో ప్రాంగణంలో బోర్డు దర్శనమిచ్చింది. దీంతో చికిత్సకు వెళ్లిన రోగులతో పాటు, పట్టాన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇక దీనిపై ప్రతిపక్షం టీడీపీ మండిపడింది. ఆస్పత్రి ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =