మహిళా ఓటు బ్యాంక్‌పై బాబు ఫోకస్.. అక్కడి నుంచి భువనేశ్వరి పోటీ?

Nara Bhuvaneshwari, TDP, Chandrababu Naidu, AP Politics, AP Elections, Womens Vote, YCP, Jagan Mohan Reddy, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu, Mango News Telugu, Mango News
Nara Bhuvaneshwari, TDP, Chandrababu Naidu, AP Politics, AP Elections

నారా భువనేశ్వరి.. మహనీయుడు ఎన్టీఆర్ కూతురు.. చంద్రబాబు నాయుడు సతీమణి. తన తండ్రి, భర్త, కుమారుడు.. దాదాపు తమ కుటుంబమంతా రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ.. భువనేశ్వరి మాత్రం ఏనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. రాజకీయాలపై ఎన్నడూ స్పందించనూ లేదు. మొట్టమొదటిసారి తన భర్త జైలుకు వెళ్లినప్పుడు ఆమె బయటకొచ్చారు. తన గళం వినిపించారు. తన భర్తను బయటికి తీసుకొచ్చేందుకు తన కొడుకు నారా లోకేష్, పార్టీ నేతలతో కలిసి ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు.

ఎన్నికలు ముంచుకొస్తుండడంతో భువనేశ్వరి మరింత యాక్టివ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారన్న వార్తను తట్టుకోలేక అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారందరి కుటుంబాలను పరామర్శిస్తూ వస్తున్నారు భువనేశ్వరి. నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే భువనేశ్వరి పర్యటనకు జనాలు, పార్టీ కేడర్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈక్రమంలో ఆమెను వచ్చే ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. పార్లమెంట్‌కు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారట.

ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. తమ గెలుపు గుర్రాలను దశలవారీగా రంగంలోకి దింపుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పి కొట్టేలా పథకాలను రచిస్తున్నారు. అటు వైసీపీ అభ్యర్థులను ఢీ కొట్టేలా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన భార్య నారా భువనేశ్వరిని కూడా రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదే విషయంపై ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నాయుడు చర్చించారట. భువనేశ్వరిని బరిలోకి దించితే ఎలా ఉంటుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి పోటీ చేయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అనే అంశాలపై చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చలు జరిపారట.  విశాఖ లేదా విజయవాడ నుంచి భువనేశ్వరిని పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఆ రెండు స్థానాలు కూడా కాకపోతే చివరికి రాజమండ్రి నుంచి అయినా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. మ‌హిళా సెంటిమెంటు ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ఈ ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి చంద్రబాబు ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో..

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =