గన్నవరంలో పోటీ చేస్తారా? లేదా?

Vallabhaneni,vamsi,Vallabhaneni Vamsi,ysrcp,Chandrababu,Gannavaram,Tdp,Where is Vallabhaneni Vamsi?, Legislative Assembly, Member of the Legislative Assembly of Andhra Pradesh, cm jagan, Andhra Pradesh News Updates, AP Political News, Mango News Telugu, Mango News
vallabhaneni,vamsi,Vallabhaneni Vamsi,ysrcp,Chandrababu,Gannavaram,Tdp,Where is Vallabhaneni Vamsi?

టీడీపీ, జనసేనపై  తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నాయకుల్లో ఒకరైన  వల్లభనేని వంశీ..  కొద్ది నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు..తన వాయిస్ వినిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ, టీడీపీని టార్గెట్ చేయడానికి వైసీపీకి ఒక అస్త్రంగా మారిపోయారు. ఘాటైన విమర్శలు, ఆరోపణలతో టీడీపీ ముఖ్యనేతల్ని ఎడాపెడ తిట్టడంతో వంశీ వైసీపీలో బాగానే పాపులర్ అయ్యారు.

అయితే ఏపీలో కొద్దిరోజుల్లోనే ఎన్నికలు రాబోతుండటంతో అన్ని పార్టీలలో ఎన్నికల కాక మొదలయింది. అయితే వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు, సమన్వయ కర్తల నియామకం వంటి  హడావుడి జరుగుతున్నా కూడా   వల్లభనేని వంశీ  ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది. నియోజక వర్గంలో ఉంటున్నా కూడా  తన ఫోకస్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకటి రెండు కాదు.. సుమారు నాలుగు నెలలుగా వార్తల్లో కూడా వంశీ రాకపోకవడం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ఎప్పుడూ అందరి దృష్టిలో పడే వంశీ.. ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే  సందేహం ఇప్పుడు పార్టీ కేడర్లోనూ కనిపిస్తోంది.  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వంశీ విజయం సాధించారు. అయితే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించడానికి ముందుగా వైసీపీ భావించినా..పార్థసారథి టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించడంతో మళ్లీ వంశీ పేరు తెరమీదకు వచ్చింది. నిజానికి అధిష్టాన మనసులో అసలు వంశీ ఉంటే.. పార్థసారథి పేరు వినిపించకూడదు కదా అన్న వాదనలు వినిపించాయి.కాకపోతే ఇప్పుడు పార్ధసారథి సైకలెక్కడంతో వంశీకి లైన్ క్లియర్ అయింది కానీ ..ఇప్పుడైనా వంశీ పేరును జగన్ పరిశీలిస్తారా లేదా అనుమానం వైసీపీ వర్గాల్లో కూడా  ఉంది.

ఇప్పటికే వైసీపీలో భారీ మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం జగన్. 31మంది సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు నిరాకరించడం, మార్చడం కూడా చేశారు. అయితే ఈ లిస్టులో  గన్నవరం నియోజక వర్గం పేరు లేదు. దీంతో  గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా వంశీ పోటీ చేస్తారా చేయరా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగానే ఇలా మౌనం వహిస్తున్నారా, లేక ఎన్నికల్లో పోటీ చేయడంపై తనకు ఆసక్తి లేకపోవడంతో నాలుగు నెలల నుంచి దూరంగా ఉంటున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి పోటీ చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతోనే..వల్లభనేని వంశీ ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది.  వంశీ  నోటిదురుసుతో సొంత సామాజిక వర్గంలోనూ, పార్టీలోనూ వ్యతిరేకత మూటగట్టు కోవడం వల్లే ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. చివరకు ఇప్పుడు సన్నిహితులకు కూడా వంశీ అందుబాటులోకి రాకపోవడం, మీడియా ముందు కనిపించకపోవడంతో అసలు వంశీ మనసులో ఏముందనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =