ఏపీ ఎన్నికలలో బీజేపీ ప్లాన్ ఏంటి?

What is BJPs plan in AP elections,What is BJPs plan,BJPs plan in AP elections,plan in AP elections,BJP ,Telangana assembly election, Kishan Reddy , TDP , Pawan Kalyan ,Janasena BJPs plan in AP elections,Mango News,Mango News Telugu,Vote share in Andhra Pradesh,BJP chooses to remain silent,Andhra Pradesh polls,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
BJP ,Telangana assembly election, Kishan Reddy , TDP , Pawan Kalyan ,Janasena? BJP's plan in AP elections,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీ, జనసేన రెండు పార్టీలలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి రావడం బీజేపీ సంగతి ఏమో కానీ జనసేనకు మాత్రం అది కచ్చితంగా మైనస్ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు  చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలు వచ్చేముందు జనసేనాని పవన్ కళ్యాణ్  తప్పుడు  నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మళ్లీ ఏపీ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి వస్తే ప్రజలు నమ్మరని.. విడివిడిగా పోటీ చేస్తేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. దీంతో జనసేన ఇప్పటికే టీడీపీతోనే వచ్చే ఎన్నికలలో తాము బరిలోకి దిగుతామని క్లారిటీ ఇచ్చేసింది.

అటు బీజేపీ కూడా జనసేనను కలుపుకొని పోవడానికి అంత ఆశక్తి చూపించడం లేదు. ఒంటరిగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసినా కూడా పవన్ క్రేజ్ బీజేపీకి ఏ మాత్రం కలిసిరాలేదు.  20నుంచి 30 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతూ వచ్చిన కమలనాథులకు ఊహించని విధంగా కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మొదట్లో సింగిల్‌గానే బరిలోకి దిగాలని బీజేపీ భావించినా కూడా అనూహ్యంగా జనసేన పార్టీతో కలిసి పోటీ చేసింది. ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకు నష్టమే జరిగింది తప్ప లాభం లేదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇటు  త్వరలో రాబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ డిసైడ్ అయింది.

తాజాగా బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీనిపై ఇన్ డైరక్టుగా చిన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు.  లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏ  ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  దీన్ని బట్టి చూస్తే  చివరకు జనసేన పార్టీని  కూడా ఈ  ఎన్నికలలో దూరం పెడుతున్నట్లే తెలుస్తోంది.  అయితే ఎన్డీయేలో సభ్యత్వం ఉన్న జనసేన పార్టీ  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ రెండు పార్టీలతోనూ పొత్తు కొనసాగిస్తూ ఉంది.

ఇప్పుడు కిషన్ రెడ్డ ప్రకటనతో తెలంగాణలో ఈ రెండు పార్టీల మద్య పొత్తు లేనట్లే తేలింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ, జనసేనను దూరం పెడుతుందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఏపీలో బీజేపీని ఏమాత్రం పట్టించుకోని పవన్ కళ్యాణ్.. టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు . దాంతో జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్నా.. అది టీడీపీకే లాభం చేకూరుతుందనే అభిప్రాయం కమలం దళంలో  ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తుపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =