లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్

Congress Focused on Lok Sabha Elections,Congress Focused on Lok Sabha,Focused on Lok Sabha Elections,CM Revanth reddy, Mynampally Hanmanth rao, Firoz Khan, Addanki Dayakar, Revanth reddy cabinet,Mango News,Mango News Telugu,2024 Lok Sabha elections,Lok Sabha Elections Latest News,Lok Sabha Elections Latest Updates,Lok Sabha Elections Live News,CM Revanth reddy Latest News,CM Revanth reddy Latest Updates
CM Revanth reddy, Mynampally Hanmanth rao, Firoz Khan, Addanki Dayakar, Revanth reddy cabinet

పదేళ్ల తర్వాత తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 17కు 17 స్థానాలను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పథకాలను రచిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నిలిచే అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రస్తుతం ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకొని.. ఇప్పటి నుంచి ప్రజల్లోకి పంపించాలని కాంగ్రెస్ భావిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావును కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆ తర్వాత మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది.

అటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. ఆయన్ను కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల కదనరంగంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఫిరోజ్ ఖాన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకొని.. ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరగా ఉంచాలని చూస్తోంది. అటు అద్దంకి దయాకర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకొని వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

దీనిపై చర్చించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారట. మైనంపల్లి హన్మంతరావు, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్‌లను కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల పార్టీకి కలిగే లాభాలు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే సత్ఫలితాలు, ఇతర అంశాలపై హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారట. మరి ఈ నిర్ణయానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =