తిరిగి తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్.?

Bandi Sanjay as Telangana BJP Chief Again,Bandi Sanjay as BJP Chief,Telangana BJP Chief Again,Kishan reddy, Telangana BJP Chief, Bandi sanjay, BJP Highcomand,Mango News,Mango News Telugu,Telangana BJP Chief Latest News,Telangana BJP Chief Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Bandi Sanjay Latest News,Bandi Sanjay Latest Updates
Kishan reddy, Telangana BJP Chief, Bandi sanjay, BJP Highcomand

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి తప్పుకోనున్నారా..? తిరిగి బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు బండి సంజయ్. కేసీఆర్ సర్కార్‌పై పెద్ద యుద్ధం చేసి బీజేపీని బలోపేతం చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ ప్రతి మూడేళ్లకోసారి రాష్ట్రాల అధ్యక్షులను ఛేంజ్ చేస్తుంటుంది. ఈక్రమంలో మరోసారి అధ్యక్ష పదవి బండి సంజయ్‌కు దక్కుతుందని అంతా భావించారు.

కానీ హైకమాండ్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముంగిట తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించి ఎంపీ కిషన్ రెడ్డిని నియమించింది. అప్పటి నుంచే తెలంగాణలో బీజేపీ పతనమైపోయిందనే వాదన కూడా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపిన బీజేపీకి షాక్ తగిలింది. కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే పోయిన సారి కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శనే చేసింది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు పడితే.. తాజా ఎన్నికల్లో 14 శాతం ఓట్లు పడ్డాయి.

అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయితే..  జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో తెలంగాణలో బీజేపీ ఓటమి పాలయినందున కిషన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారనే చర్చ మొదలయింది. అటు కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని.. కేవలం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది?.. పార్టీని నడిపించే సత్తా తెలంగాణ బీజేపీలో ఎవరికి ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో బండి సంజయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోసారి బండి సంజయ్‌కే అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కిషన్ రెడ్డి నిజంగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా..? బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోనుంది..? తిరిగి అధ్యక్ష పదవి ఇస్తే బండి సంజయ్ స్వీకరిస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =