అధికార పార్టీకే మళ్లీ పట్టం కడతారా?

Will The Ruling YCP Take The Crown Again?,Gurajala Fight,YCP Take The Crown Again,YCP,TDP,Janasena,Chandrababu,Jagan,Gurajala,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,YSRCP,YS Jagan,CM YS Jagan,Gurajala Politics,Gurajala Elections,YSRCP News,Gurazala Assembly Constituency,Gurazala Assembly Election 2024

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో పార్టీల  ప్రచారం తారాస్థాయికి చేరింది. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో అధికార వైసీపీ నేతలు ఉండగా..వైసీపీ వైఫల్యాలే తమకు ప్రచార అస్త్రాలు అంటూ వాటితోనే కూటమి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉన్నారు.

ఇక ఏపీలోని హైవోల్టేజీ నియోజకవర్గాల్లో ఒకటిగా గురజాల ఎప్పుడూ ఉంటుంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతుండగా.. తెలుగు దేశం పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు మరోసారి  మహేష్ రెడ్డితో పోటీ పడుతున్నారు.

1952 గురజాల నియోజకవర్గం ఏర్పడగా 2019లో జరిగిన  ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపు నుంచి బరిలో దిగిన  కాసు మహేష్ రెడ్డి …అత్యధిక మెజార్టీని సాధించారు. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నేతలు కూడా వైఎస్సార్సీపీకే  జై కొట్టారు. ఈసారి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని..గెలుపు వైసీపీదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గురజాల నియెజకవర్గంలో కాంగ్రెస్ కూడా బరిలో ఉండటంతో ఏ పార్టీ ఓట్లు చీలుతాయోనన్న ఉత్కంఠ అక్కడ నెలకొంది. ఇక జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ పార్టీని  గట్టెక్కిస్తాయనే ధీమాలో  కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. అయితే సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి చేరడం వల్ల తమకు కలిసి వస్తుందని.. ఇదే పార్టీని  గెలిపిస్తుందని   యరపతినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికలలో  గురజాలలో  ఏ పార్టీ గెలిచినా కూడా తక్కువ మెజార్టీతోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =