ఆంధ్ర రంజీ క్రికెట్‌లో వైసీపీ ఎంట్రీపై రగడ

YCP, TDP, Chandrababu, Jagan Mohan Reddy,Hanuma Vihari, son of YCP corporator Narasimhachari, Pridhviraj, Andhra Ranji cricket,Andhra Pradesh, Andhra Pradesh Latest News, AP CM YS Jagan, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YCP, TDP, Chandrababu, Jagan Mohan Reddy,Hanuma Vihari, son of YCP corporator Narasimhachari, Pridhviraj, Andhra Ranji cricket

అసలే ఎన్నికల హడావుడితో ఏపీ అంతా హీటెక్కిపోతుంటే.. రంజీ క్రికెట్ మ్యాచ్‌లో రాజకీయాలు ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. తన తండ్రి పొలిటికల్ అండతో  రెచ్చిపోవచ్చనుకున్న ఓ ఆంధ్రా జట్టు క్రికెటర్ రేపిన చిచ్చు..అటు క్రికెట్‌లోనూ, ఇటు రాజకీయాలలోనూ మంటలు రాజేస్తున్నాయి.

అవును.. తాజాగా ఆంధ్రా క్రికెట్ రంజీ జట్టులో హనుమ విహారిని కెఫ్టెన్సీ నుంచి తప్పించడంతో..సోషల్ మీడియా అంతా అదే  టాపిక్  నడుస్తోంది. నిజానికి జరిగింది ఏంటంటే.. ఆంధ్రా క్రికెట్ రంజీ జట్టులో 17 వ మెంబర్ గా ఉన్న వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి కొడుకు  పృధ్విరాజ్‌ను ఓ విషయంలో  కెప్టన్ విహారి మందలించాడు. దీంతో పృధ్విరాజ్‌ తండ్రి నరసింహాచారి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలకు ఫిర్యాదు చేసి తన కొడుకు జీవితం అన్యాయం అయిపోయినంత బిల్డప్ ఇచ్చాడు.

ఇటు నరసింహాచారి ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. ఆంధ్ర క్రికెటర్స్ అసోసియేషన్ మొత్తాన్ని కూడా  తమ గుప్పెట్లో ఉంచుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆగమేఘాలపై స్పందించారు.ఈ ఎఫెక్ట్‌ గట్టిగానే పడటంతో ఏడేళ్లుగా రంజీ జట్టుకు కెప్టన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విహారి మొదటి మ్యాచ్ తరువాత  ఎవరూ ఏ మాత్రం ఊహించని విధంగాతొలిగించబడ్డాడు. దీంతో దీనిపై రియాక్ట్ అయిన హనుమ విహారీ..ఓ రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని..ఫ్యూచర్లో  ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని  పెట్టిన ఇన్ స్టా పోస్ట్.. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

హనుమ విహారీ పోస్టుతో.. సోషల్ మీడియాలో హనుమకు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.తాజాగా ఈ  వార్తల్లో వాస్తవాలపై  జనసేన  వీడియో క్లిప్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.  తమకింద బ్రతకకుంటే అణచివేయడం లేదా చంపేయడమే వైసీపీ విధానం.. అది ఒక సామాన్య దళిత డ్రైవర్ అయినా.. భారత దేశానికి ప్రతినిధ్యం వహించిన క్రికెటర్ అయినా.. అనే క్యాప్షన్‌ను జనసేన ట్యాగ్ చేసింది.

ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. అలాగే హనుమవిహారి చురుకుగా ఆడే ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఏపీ తరపున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడని బాబు అన్నారు. హనుమ మీరు దృఢంగా ఉండండి. ఆట పట్ల మీ చిత్తశుద్ధి మరియు నిబద్ధత వెలకట్టలేనిది. ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు. మేము మీకు అండగా ఉంటాము.. మరియు న్యాయం జరిగేలా చూస్తాము.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

దీంతో పాటు  ఏపీకి, దేశానికి విహారి చాంపియన్ ప్లేయర్.. హనుమ విహారితో తాము ఉన్నామని సోషల్ మీడియాలో హనుమవిహారికి అనుకూలంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫ్రాక్చర్ అయిన చేతితో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి భారత్, ఏపీకి గొప్పగా ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్ర రంజీ టీమ్‌కు  హనుమ విహారీ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. మొత్తంగా  క్రికెట్‌లో రాజకీయాలు అడుగుపెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలు హీటెక్కుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 6 =