బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో 90,533 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం

Badvel, Badvel By Election Result Live, Badvel By Election Result Live Counting, Badvel By-election Counting, Badvel By-election Results 2021, badvel election results 2021, By Election Result 2021 Live Updates, Bypoll Results 2021 LIVE Updates, Dasari Sudha Won in Badvel Assembly By-election, in Badvel Assembly By-election, Mango News, Votes Counting Live Updates, YSRCP Candidate Dasari Sudha Won, YSRCP Candidate Dasari Sudha Won in Badvel Assembly By-election

బద్వేలు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ భారీగా పెరిగింది. 13 రౌండ్ల అనంతరం వైస్సార్సీపీకి 1,12,211 ఓట్లు, బీజేపీకీ 21678 ఓట్లు, కాంగ్రెస్‌ కు 6,235 ఓట్లు వచ్చాయి. బద్వేలు పోరులో మొత్తం 15 మంది బరిలో నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేసి, ఈ ఉపఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాగా ఈ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థికే ప్రజలు పట్టం కట్టారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటినుంచి అంచనాలకు అనుగుణంగానే ‘ఫ్యాన్‌’ హవా కొనసాగింది. మొత్తంగా 90,533 భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపును సొంతం చేసుకోవడంతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యాకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =