ఓలా ఎస్‌1 స్కూటర్‌కు గుడ్‌ బై.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఓలా

Ola Offers To Replace S1 Scooter Part Amid Safety Concerns on Customers Claim,Ola Offers To Replace S1 Scooter Part,S1 Scooter Part Amid Safety Concerns,Safety Concerns on Customers Claim,S1 Scooter Part,Ola Safety Concerns on Customers,Mango News,Mango News Telugu,Ola offers free replacement of S1 scooter part,Ola Electric offers free upgrade,Ola Electric offers buyers to upgrade,Good bye to Ola S1 scooter, Limited production capacity, Ola S1 Air Launch, Ola S1 scooter,Ola S1 Scooter Latest News,Ola S1 scooter Latest Updates,Ola Latest News and Updates

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. తమ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 2021లో రిలీజ్ చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్టును నిలిపివేసినట్లు అనౌన్స్ చేసింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎస్1 వేరియంట్‌ను తొలగించి.. ఎస్1 ప్రోపై, ఎస్‌ 1 ఎయిర్ మోడల్స్‌ ఫోకస్‌ పెట్టనుందని చెప్పింది.

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ లాంచింగ్‌ సందర్బంగా.. ఎస్1​ స్కూటర్‌ సేల్స్‌ను నిలిపి వేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. అయితే తమ నిర్ణయానికి కారణాలు చెప్పలేద. లిమిటెడ్ ప్రొడక్ట్ కెపాసిటీతో పాటు ఇతర వేరియంట్‌లకు ఎక్కువ డిమాండ్ వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఫీచర్ల పరంగా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రొ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉండటం వల్ల.. ఎస్‌ 1 వేరియంట్‌ సేల్స్ ఆపేసిందోమోనని అంచనా వేస్తున్నాయి. ఓలా కంపెనీ తీసుకున్న డెసిషన్‌తో.. ఇకపై ఓలా పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అలాగే రెండింటీ మధ్య పేరులో మార్పు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నాయి.

ఇప్పటికే ఎస్‌1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్‌లు ఇప్పుడు ఏం చేయాలో కూడా చెప్పింది కంపెనీ. వారందరికీ ప్లాన్‌లలో మార్పు గురించి తెలియజేస్తూ ఈ మెయిల్‌ను పంపించి.. వారికి మూడు ఆప్షన్‌లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం ఒకటి..2022 చివరిలో ఎస్‌1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం రెండోది.. లేదా వారి బుకింగ్‌ను క్యాన్సిల్ చేసి రీఫండ్‌ పొందడం మూడోది.. ఎస్‌ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ గా ఉండగా.. ఓలా యాప్‌లో జనవరి 21న ఫైనల్ పేమెంట్ విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్‌లు రూ. 30,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.ఇంత వరకూ రాకుండానే ఈ సేల్స్ ఆపేశారు.

మరోవైపు రాబోయే ఎలక్ట్రిక్​ స్కూటర్‌ ఓల్​ ఎస్​1 ఎయిర్.. ఇప్పటికే ఉన్న కస్లమర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. అనూహ్యంగా విండోను తెరిచిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌లు బుకింగ్ అయ్యాయని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్‌ లో చెప్పారు. జనరల్ పబ్లిక్‌కు ఈ నెల 31నుంచి ఈ సేల్‌ షురూ అవుతుందని.. ఎస్‌1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయని సీఈఓ తెలిపారు. అయితే ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎయిర్‌ కాస్ట్ రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =