న్యూజిలాండ్‌ యూత్‌ పార్లమెంట్‌‌ ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి

Andhra Pradesh, Andhra Pradesh girl elected as MP of the Newzealand, Andhra Pradesh Young Lady Elected as MP of The New Zealand, Andhra Pradesh Young Lady Elected as MP of The New Zealand Youth Parliament, Mango News, New Zealand, new zealand 2022, new zealand parliament members, new zealand parliament seats, New Zealand Youth Parliament, New Zealand Youth Parliament MP, Telugu girl elected as MP of the Newzealand, Youth Parliament 2022, Youth Parliament 2022 participants

న్యూజిలాండ్ దేశం‌లో మన తెలుగమ్మాయి గడ్డం మేఘనకు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్‌ దేశ ‘యూత్‌ పార్లమెంట్’‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘనను అక్కడి ప్రభుత్వం నామినేట్‌ చేసింది. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు. కాగా, మేఘన తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడే రవికుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు.

అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నతనం నుంచే మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇక స్కూల్ డేస్ నుంచే మేఘన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. అలాగే ఆ దేశానికి వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, కనీస వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్‌ 16న జరిగిన ఈ ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్‌ నాన్‌ డిమోలెన్‌ తాజాగా మేఘన ఫ్యామిలీకి తెలియజేశారు. మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + one =