12 వారాల పాటు అన్ని న్యూస్ చానెళ్లకు వీక్లీ రేటింగ్స్ నిలిపివేత

BARC Decides to Stop Rating, BARC Decides to Stop Rating of All News Channels for 3 Months, BARC pauses weekly television ratings, BARC suspends news channels, BARC suspends rating of news channels, BARC suspends ratings of TV news channels, BARC To Pause News Channel Ratings, Fake TRP scam, Fake TV Ratings Case, No News Channel Ratings for 3 Months

ఇటీవల దేశంలో పలు ఛానెళ్లు టీఆర్‌పీ విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫేక్ టీఆర్‌పీ తో మోసాలకు పాల్పడుతున్నాయని 3 న్యూస్ ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చానెళ్లకు రేటింగ్ ఇచ్చే టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటుగా దేశంలోని అన్ని న్యూస్ చానెళ్లకు ప్రతి వారం ఇచ్చే రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

రేటింగ్ ఇచ్చే విధానంలో ప్రస్తుత ప్రమాణాలను ఓసారి సమీక్షించికుని, మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయంతో మొత్తం 12 వారాల పాటు న్యూస్ చానెళ్లకు వీక్లీ రేటింగ్‌లు నిలిచిపోనున్నాయి. మరోవైపు బార్క్ నిర్ణయాన్ని దేశంలోని ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ స్వాగతించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =