ప్రతిష్టాత్మక కేంద్ర హోంశాఖ మెడల్స్ గెలుచుకున్న 13 మంది తెలంగాణ పోలీసులు, అవార్డులకు ఎంపికైంది వీరే

Telangana 13 Police Personnel Gets Union Home Minister's Special Operation Medals For The Year of 2022, Union Home Minister's Special Operation Medals, Telangana 13 Police Personnel Got Medals, Special Operation Medals Year 2022, Mango News,Mango News Telugu, Anil Kumar Additional DGP Tengana,Keita Ravinder Reddy DSP,Mogulla Venkateshwar Goud Inspector,Kukudapu Srinivasulu Sub Inspector,Mohammad Akhtar Pasha Sub Inspector,Pandey Jitender Prasad Sub Inspector,Syed Abdul Karim Sub Inspector, Sanugommula Rajavardhan Reddy Head Constable,Mohammad Taj Pasha Head Constable,Mohammad Fariduddin Constable,Lakshminarayana Constable,Kodgal Kiran Kumar Constable,Syed Zia ul Haq Constable

2022 సంవత్సరానికి గానూ ‘కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్’ కోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 63 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు స‌ర్దార్ వల్లభ్ భాయ్ ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో.. 19 మంది పోలీసులు ఢిల్లీకి చెందినవారు, 16 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా తెలంగాణ నుంచి 13 మంది, మహారాష్ట్ర నుంచి 11 మంది అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి నలుగురు ఉన్నారు.

కాగా అవార్డు గ్రహీతలలో ఇద్దరు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) ర్యాంక్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్లు, ఇద్దరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), మరియు ముగ్గురు డిప్యూటీ (డీఎస్పీ) ర్యాంక్ అధికారులు ఉన్నారు. ఇక ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్-ర్యాంక్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ‘యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్’కు వివిధ కేడర్లకు చెందిన ఎంపికైన పోలీసుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

‘యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్’కు ఎంపికైన తెలంగాణ పోలీసులు..

 • అనిల్ కుమార్ – అడిషనల్ డీజీపీ తెంగాణ
 • కైతా రవీందర్ రెడ్డి – డీఎస్పీ
 • మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ – ఇన్ స్పెక్టర్
 • కుకుడపు శ్రీనివాసులు – సబ్ ఇన్ స్పెక్టర్
 • మహ్మద్ అక్తర్ పాషా – సబ్ ఇన్ స్పెక్టర్
 • పాండే జితేందర్ ప్రసాద్ – సబ్ ఇన్ స్పెక్టర్
 • సయీద్ అబ్దుల్ కరీం – సబ్ ఇన్ స్పెక్టర్
 • సనుగొమ్ముల రాజవర్ధన్ రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
 • మహ్మద్ తాజ్ పాషా – హెడ్ కానిస్టేబుల్
 • మహ్మద్ ఫరీదుద్దీన్ – కానిస్టేబుల్
 • బచ్చుల లక్ష్మీనారాయణ – కానిస్టేబుల్
 • కొడ్గల్ కిరణ్ కుమార్ – కానిస్టేబుల్
 • సయీద్ జియా ఉల్ హక్ – కానిస్టేబుల్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =