వార్తా పత్రికల చివరలో 4 రంగుల స్టోరీ మీకు తెలుసా?

Do You Know About 4 Colours Story at Bottom of The News Papers,Do You Know About 4 Colours Story,Bottom of The News Papers,4 Colours Story,4 Colours Story of The News Papers,Mango News,Mango News Telugu,News Papers,News Papers 4 color,4 color story at the end of news papers,Primary colors,Why do newspapers print a combination,Noticed Four Dots at The Bottom,Newspapers print coloured dots,News Paper 4 Colours Story,News Paper 4 Colours Story Latest News,News Paper 4 Colours Story Latest Updates,News Paper 4 Colours Story Live News

ఎన్ని టీవీ ఛానల్స్ (TV Channels) వచ్చినా.. ఎన్ని మొబైల్ యాప్స్ (Mobile Apps) రోజురోజుకు దూసుకుపోతున్నా.. న్యూస్ పేపర్‌లో అక్షరాలు చదివి అలవాటున్నవాళ్లు మాత్రం ఇప్పటికీ ఆ అలవాటును కంటెన్యూ చేస్తూనే ఉన్నారు. చేతివేళ్ల మధ్య తిరిగే పేపర్లు, గుచ్చి గుచ్చి చదువుతూ..అప్పుడప్పుడు తడిమిచూసుకునే అక్షరాలు ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. అందుకే పేపర్ మీద అయినా పుస్తకం మీద ఉన్న అక్షరాలను ప్రేమిస్తూ చదివేవాళ్లు అంత ఈజీగా ఆ అలవాటును మానుకోలేరు.

ఇప్పటికీ పేపర్ బాయ్‌కు డిమాండ్ తగ్గకపోవడానికి, పొద్దునే వేడి వేడి టీతో పాటు పేపర్ చదివే అలవాటుకు ఇదే కారణం. అయితే అప్పుడప్పుడూ పేపర్ చదివేవాళ్లు పెద్దగా పట్టించుకోరు కానీ.. రెగ్యులర్‌గా పేపర్ చదివేవాళ్లు మాత్రం పేపర్‌ను అణువణువు పరీక్షగానే గమనిస్తారు. అలా గమనిస్తే ఒక్కరోజు న్యూస్ పేపర్ చదవలేకపోతే ఆరోజంతా ఏదో కోల్పోయినట్టుగా వుంటుంది. అయితే, ఇప్పటికీ న్యూస్ పేపర్ (News Paper) ని రెగ్యులర్ గా చదివేవాళ్లు అక్కడక్కడైనా వుంటారు.

అయితే, ఏ వార్తా పత్రికలను గమనించినా.. చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలోనూ ఈ కలర్స్ (4 Colours) తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి. వీటిని చాలామంది పట్టించుకోకపోయినా.. మరికొంతమందిని అసలు పేపర్ కింద ఈ రంగులకు మీనింగ్ ఏంటో అన్న ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది. అయితే న్యూస్ పేపర్‌లో కింద ఉండే నాలుగు రంగులు C.M.Y.B. అంటే.. C ఫర్.. సియాన్‌ అంటే నీలం (Blue), M ఫర్ మెజెంటా అంటే గులాబీ (Pink) అలాగే Y ఫర్ అంటే యెల్లో (Yellow), ఇక చివరలో B ఫర్ బ్లాక్ అంటే నలుపు (Black) రంగులకు ఈ రంగులును ఇవి సూచిస్తాయన్న మాట. ఈ నాలుగింటినీ ప్రింటింగ్‌ పరిభాషలో.. ప్రాథమిక రంగులు (Primary colors)గా పిలుస్తారు.

ఈ నాలుగు కలర్స్‌ కాంబినేషన్‌ (Combination) ఆధారంగానే.. మనకు కావలసిన కొత్త రంగు వస్తుందన్న మాట. అలాగే పేపర్‌ ప్రింట్‌ చేసే సమయంలో.. ఈ నాలుగు రంగులకు సంబంధించిన ప్లేట్స్‌ (Plates)ని అమరుస్తారట. ఈ ప్లేట్స్‌ కేటాయించిన స్థలం నుంచి.. పక్కకు జరిగితే ప్రింటింగ్‌లో అక్షరాలు (letters), ఫోటోలు (Photos) సరిగ్గా ప్రింట్ అవ్వవట. అలా అని ప్రింటింగ్ అవుతున్న ప్రతీ పేపర్‌ (Each Paper)ను ఓపెన్‌ చేస్తే.. సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో చూడలేరు కాబట్టి పేపర్‌కి చివర్లో ఉండే ఈ నాలుగు రంగులను వేసి అక్కడక్కడ చెక్‌ చేస్తుంటారట. ఒకవేళ ఈ నాలుగు రంగులు సరిగ్గా ప్రింట్‌ కాకుండా.. ఏమైనా ముద్దగా వస్తే వెంటనే అలర్ట్‌ అయి ఆ కలర్‌ ప్లేట్స్‌ను సెట్‌ చేసి మళ్లీ ప్రింటింగ్ ప్రారంభిస్తారట. అలా వాళ్ల అంచనా కోసం వేసుకున్న రంగులే న్యూస్ పేపర్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయన్న మాట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =