జీ మెయిల్‌‌లో ఈ పొరపాటు చేస్తున్నారా?

Making This Mistake In Gmail, This Mistake In Gmail, Gmail Mistake, Send Mail, Gmail, An Editing Feature In Gmail, Select Undo, Undo Option, Latest Gmail News, Gmail News Update, Gmail Spam, Technology, Latest Gmail Spam News, Mango News, Mango News Telugu
send mail,Making this mistake in Gmail?,Gmail,an editing feature in Gmail,select undo ,undo option

ఇప్పుడు అఫీషియల్‌గా చేసే ఏ పని అయినా మెయిల్స్ ద్వారానే  జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆఫీసులన్నీ కూడా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలంటే లీవ్ లెటర్ నుంచి రిజిగ్నేషన్ లెటర్ వరకూ.. అన్నీ మెయిల్ ద్వారానే జరగాలంటున్నారు. అయితే కొన్నిసార్లు జీ మెయిల్‌ను పంపించేటప్పుడు అనుకోకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.  మనం పంపాలనుకున్న మెయిల్‌లో ఏవైనా తప్పులు ఉన్నప్పుడు  వెంటనే మరోసారి సరి చేసి ఇంకో మెయిల్‌ పంపిస్తే ఎదుటి వ్యక్తికి కరెక్టుగా కన్వే అవుతుంది.

మెయిల్ తప్పుగా పంపించడమే కాకుండా ఒక్కోసారి  మనం పంపాలనుకున్న వ్యక్తికి కాకుండా.. మరో వ్యక్తికి పొరపాటున పంపించేస్తూ ఉంటాం. అయితే వాట్సాప్‌, టెలిగ్రామ్ లాంటి  మెసేజింగ్ యాప్స్‌లో అయితే.. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎడిట్ చేయొచ్చు లేదంటే.. డిలీట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి జీమెయిల్‌లో ఎలా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక అయ్యో పొరపాటున వేరే వాళ్లకు పంపాం వాళ్లేం మిస్ యూజ్ చేస్తారో ఏంటోనని భయపడుతూ ఉంటారు.

అయితే జీ మెయిల్‌లో కూడా ఎడిట్ చేసుకునే ఓ ఫీచర్‌ అందుబాటులో ఉందన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. పొరపాటున మన మెయిల్ వేరే వారికి పంపితే వెంటే అన్డూను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే  కేవలం 30 సెకండ్ల లోపు మాత్రమే అన్డూ ఆప్షన్ ను ఎంచుకునే  అవకాశం ఉంటుంది. చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ..  ఏదైనా మెయిల్ పంపిన తర్వాత.. స్క్రీన్‌ లెఫ్ట్‌ సైడ్‌ కిందివైపున్న బ్లాక్‌ బాక్స్‌లో అన్డూ లింక్‌ ఉంటుంది. మనం పొరపాటున వేరే వాళ్లకు పంపినా లేదా తప్పుగా పంపినట్లు అన్పించినా సమయం ముగిసే లోపు క్లిక్‌ చేస్తే మనం పంపిన మెయిల్‌ సెండ్‌ అవ్వదు.

జీ మెయిల్‌లో  ఈ ఫీచర్‌ సహాయంతో మీ మెయిల్‌ను రీకాల్ కూడా చేసుకోవచ్చు. దీని కోసం  మీ స్మార్ట్ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘జనరల్‌’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.ఇందులో అన్డూ సెండ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిలో అన్‌డూ సమయాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 5 సెకండ్లు,10 సెకండ్లు,20సెకండ్లు,30 సెకండ్లలో మెయిల్‌ను అన్డూ చేసుకునేలో సెట్టింగ్ మార్చుకోవచ్చు. సాధారణంగా చాలామంది అన్డూ సెట్టింగ్ చేసుకోరు కాబట్టి 5 సెకన్లలోనే ఆప్షన్ మాయం అయిపోతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =