చార్‌ధామ్ యాత్ర‌: ప్రారంభమైన ఆరు రోజుల్లో 20 మంది మృతి.. ప్రకటించిన ఉత్తరాఖండ్

Char Dham Yatra 2022 Uttarakhand Reports 20 Pilgrims Demise in 6 Days Since The Yatra Starts, Uttarakhand Reports 20 Pilgrims Demise in 6 Days Since The Yatra Starts, 20 Pilgrims Demise in 6 Days Since The Yatra Starts, 20 Pilgrims Demise in 6 Days Says Uttarakhand, 20 Pilgrims Demise in 6 Days, start of the Char Dham Yatra on May 3 20 pilgrims have died so far, Char Dham Yatra of Uttarakhand, Char Dham Yatra 2022, 2022 Char Dham Yatra, Char Dham Yatra, Char Dham Yatra News, Char Dham Yatra Latest News, Char Dham Yatra Latest Updates, Char Dham Yatra Live Updates, Mango News, Mango News Telugu,

చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటినుండి ఈ 6 రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించినట్లు ఉత్తరాఖండ్ ప్రకటించింది. వీరిలో ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలు మరియు అధిక ఎత్తులో కలిగే అధిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. యమునోత్రి, గంగోత్రి ధామ్‌లో 14 మంది ప్రయాణికులు చనిపోయారని, వీరిలో ఒక నేపాలీ కూలీ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే కేదార్‌నాథ్‌లో 5 మంది, బద్రీనాథ్‌లో ఒకరు మరణించారని వెల్లడించారు. ఇలా ఆరు రోజుల్లోనే 20 మంది యాత్రికులు మృతి చెందడం యాత్ర నిర్వాహకులను, నిర్వాహకులను ఆందోళనకు గురి చేసింది.

ఈ నెల 3వ తేదీన గంగోత్రి, య‌మునోత్రి ఆల‌యాల‌ను తెరవగా, అనంతరం కేదార్‌నాథ్ ధామ్ వద్ద మే 6న, మే 8న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈ కేదార్‌నాథ్ మరియు యమునోత్రి ధామ్‌లకు యాత్రికులు కష్టతరమైన మార్గంలో ప్రయాణించాలి. ఎత్తైన ప్రాంతాలలో నడవడం వల్ల చలితో ఆక్సిజన్ అందదు. అటువంటి పరిస్థితిలో, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఆస్తమాతో బాధపడుతున్న రోగులు నడకలో వారి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు అధికంగా కఠినతరమైన పర్వత ప్రాంతాల గుండా నడవడం మూలంగా వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న యాత్రికుల జీవితాలను మరింత దెబ్బతీస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =