వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్య‌లు, మండిపడ్డ బీజేపీ

Congress Leader Rahul Gandhi Alleged on Veer Savarkar He Helped The British Betrayed Mahatma Gandhi and Nehru,Congress Leader Rahul Gandhi,Alleged on Veer Savarkar,British Betrayed,Mahatma Gandhi,Nehru,Mango News,Mango News Telugu,Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Latest News And Updates, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Meeting in Necklace Road, Rajiv Gandhi, Sonia Gandhi, Telangana Bharat Jodo Yatra

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా బీజేపీ నటులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలో రాహుల్ గురువారం మరోసారి వీర్ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్య‌లు చేశారు. సావర్కర్‌ బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖపై సంతకం చేయడం ద్వారా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు సర్దార్ పటేల్ వంటి స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిస్తున్న నాయకులకు ద్రోహం చేశాడని ఆయన ఆరోపించారు. ఆయన చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గురువారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వీర్ సావర్కర్, బ్రిటిష్ వారికి రాసిన లేఖగా చెప్పబడుతున్న స్వాతంత్య్ర కాలం నాటి ఒక లేఖను చూపించారు. దీనిని గురించి రాహుల్ గాంధీ వివరిస్తూ.. ‘సర్, నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నాను’ అని రాసిన లేఖపై సావర్కర్ సంతకం చేశాడని అన్నారు. బ్రిటీష‌ర్ల‌కు సావర్క‌ర్ భ‌య‌ప‌డ్డార‌ని, వారికి సేవ‌కుడిగా ప‌ని చేసుకునేందుకు సైతం ఆయ‌న ప్ర‌య‌త్నించార‌ని, ఈ క్రమంలోనే బ్రిటిష్ వారికి సహాయం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు. అండ‌మాన్ జైలులో ఉన్న కాలంలో సావర్క‌ర్‌ బ్రిటీష‌ర్ల‌కు లేఖ రాశార‌ని, వారికి ఆయన భయపడ్డారని వ్యాఖ్యానించారు.

రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్ప‌ద కావ‌డంతో.. శివ‌సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే స్పందించారు. వీర్ సావర్క‌ర్ ప‌ట్ల త‌మ‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌ని, సావార్క‌ర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నానని తెలిపారు. మ‌రో వైపు బీజేపీ కూడా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారని, ఇది మహానీయులను అవమానించడమేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, సావర్కర్‌పై తను చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలనుకోవడం లేదని, కావాలంటే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌ను అరెస్టు చేసుకోవ‌చ్చని కూడా ఆయన స‌వాల్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =