అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు, నర్సుకు తొలి టీకా

Covid Vaccination Begins in USA,Nurse in New York Receives First Covid Vaccine,USA Begins Historic COVID Vaccination Drive,ICU Nurse Gets First Shot In New York,Historic COVID Vaccination Drive,COVID,USA,Coronavirus Vaccinations,USA Vaccine,Icu Nurse,New York,Sandra Lindsay,Mango News,Mango News Telugu,United States,Nurse Gets New York First COVID-19 Vaccine,US,US News,US Pfizer,US Corona Vaccine,Corona Vaccine News,New York,New York News,US Vaccine Campaign,Vaccine Rollout,International News,World News,Pfizer Vaccine,Vaccine Corona Coronavirus Latest News Usa,Corona Vaccine Recent Updates US,COVID-19,COVID-19 Vaccine,COVID-19 First Vaccine Given In Us,Nurse Gets New York First Coronavirus Vaccine

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అమెరికా బయోటెక్ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటర్‌ లో క్రిటికల్‌ కేర్‌లో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి కరోనా వ్యాక్సిన్‌ డోసు ఇచ్చారు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ డోసు తీసుకున్న తోలి వ్యక్తిగా నిలవడం పట్ల సాండ్రా లిండ్సే ఆనందం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. “తోలి వ్యాక్సిన్ అందించబడింది. కంగ్రాట్స్‌ అమెరికా, కంగ్రాట్స్‌ వరల్డ్‌” అంటూ ట్వీట్ చేశారు. అమెరికా ప్రజలందరికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పటికే ‌ ప్రకటించారు. అలాగే అమెరికాలోని 50 రాష్ట్రాలకు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తోలి దశ రవాణా పూర్తయినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =