ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2023 జనవరి 1 వరకు బాణసంచాపై పూర్తి నిషేధం

Delhi Govt Orders Complete Ban on The Production Sales and Use of Firecrackers Till Jan 1 2023, Delhi Bans Production And Sale Of Firecrackers, Delhi govt bans production Of Firecrackers, Delhi Bans Sale Of Firecrackers, Ban on Firecrackers Till Jan1 2023, Ban on Use of Firecrackers In Delhi, Mango News , Mango News Telugu, Ban Firecrackers In Delhi, AAP Govt Ban On Firecrackers, Pollution Cantrol In Delhi, Delhi Crackers Ban Latest News And Updates

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించడానికి ఆప్‌ ప్రభుత్వం మరోసారి బాణసంచాని నిషేధించింది. బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం మరియు పేల్చడంపై నిషేధం విధించింది. ఈ నిషేధం జనవరి 1, 2023 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ బుధవారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. అలాగే ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం/డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని ఆయన తెలిపారు. కాగా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి ఢిల్లీ పోలీస్, డీపీసీసీ మరియు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందని కూడా మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు.

గత మూడేళ్లుగా దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్న దృష్ట్యా గత ఏడాది మాదిరిగానే అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా సాధారణంగా చలి కాలంలో దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతుంది. అయితే దీనికి పలు కారణాలున్నాయి. ఈ సమయంలో ఇక్కడ పొగమంచు ఎక్కువగా ఉండటం, అలాగే వాహనాల నుంచి వచ్చే పొగతో పాటుగా ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలలోని వ్యవసాయ భూముల్లో రైతులు వ్యర్థాలను దహనం చేయడం ప్రధాన కారణం. ఇక మంత్రి తాజా ప్రకటనతో ఢిల్లీలో ఈసారి కూడా దీపావళి పటాసులు లేకుండానే జరుగనుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం 2020, 2021లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =