ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు, తగిన సమయంలో నిర్ణయం: ఈసీ

Election Commission of India Deferred the MLC Elections in AP and Telangana,Mango News,Mango News Telugu,Andhra Pradesh, Telangana Biennial Legislative Council,MLC Elections In Andhra Pradesh And Telangana Postponed,EC Defers MLC Polls In Andhra, Telangana,MLC Polls Deferred,Andhra Pradesh And Telangana MLC Elections Postponed,EC Defers MLC Polls In Ap Due To Covid-19,MLC Polls 2021,MLC Polls,MLC Elections,MLC Elections 2021,Disappointment Over Postponement Of MLC Polls,Election Commission of India,MLC Elections in AP and Telangana,MLC Elections in AP and Telangana Postponed

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నెలకున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవని, కరోనా తీవ్రత తగ్గాకే నిర్ణయం తీసుకోనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ముగ్గురు సభ్యుల పదవీకాలం మే 31వ తేదీతో, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. గడువు ముగియక ముందే ఎన్నికలను నిర్వహించాల్సి ఉండడంతో గురువారం నాడు ఈ ఎన్నికలపై ఈసీ సమీక్ష జరిపింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో పరిస్థితి మెరుగుపడేవరకు లేదా/ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా మారేవరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శాసనమండలిలకు ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ నిర్ణయించింది. అలాగే సంబంధిత రాష్ట్రాల నుండి సమాచారం తీసుకున్నాక మరియు ఎన్డిఎంఏ/ఎస్డిఎంఏ వంటి సంస్థలతో కరోనా మహమ్మారి పరిస్థితిని అంచనా వేసిన తరువాత భవిష్యత్తులో తగిన సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 12 =